EPAPER

Delhi Mayor : బీజేపీ, ఆప్‌ కౌన్సిలర్లు బాహాబాహీ.. ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా..

Delhi Mayor : బీజేపీ, ఆప్‌ కౌన్సిలర్లు బాహాబాహీ.. ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా..

Delhi Mayor : ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రణరంగాన్ని తలపించింది. బీజేపీ-ఆప్‌ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. మేయర్ ఎన్నిక కోసం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.


మరోసారి అదే పరిస్థితి..
మేయర్ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎంసీడీ భవనం వద్ద భారీ భద్రతను, హౌజ్‌లో మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ తొలుత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేసిన కౌన్సిలర్లతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 15 నిమిషాలు హౌజ్‌ను వాయిదా చేశారు. తిరిగి ప్రారంభమైన సమయంలో.. బీజేపీ కౌన్సిలర్లు ‘మోదీ.. మోదీ’అంటూ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నేరుగా ఆప్‌ కౌన్సిలర్ల వద్దకు వెళ్లి.. నినాదాలు చేస్తూ హౌజ్‌ను వాయిదా వేయాలని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను కోరారు. ఇదే సమయంలో‘‘షేమ్‌.. షేమ్‌’’ అంటూ ఆప్‌ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. మేయర్ ఎన్నికలో గెలుపు కోసం నామినేటెడ్‌ కౌన్సిలర్లను ఓటింగ్‌లో పాల్గొనేలా చూస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో నామినేటెడ్‌ మెంబర్లు ‘జై శ్రీరామ్‌’, ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రిసైడింగ్‌ అధికారి సత్య శర్మ హౌజ్‌ను వాయిదా వేశారు.

గతంలో ఏం జరిగిందంటే..
జనవరి 6న ఇదే రీతిలో ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఆ రోజు సభలో సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ మొదట 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మేయర్ ఎన్నికలో వారు ఓటువేయడానికి అనుమతి లేదని ఆప్ అభ్యంతరం తెలిపింది. వారి ప్రమాణ స్వీకారం విషయంలో ఆప్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మేయర్ ఎన్నికను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వారిని నామినేట్‌ చేశారని విమర్శించింది.


ఆప్ ఘన విజయం..
డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘనం విజయం సాధించింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమ గీతం పాడింది. మొత్తం 250 వార్డులు ఉండగా ఆప్‌ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. ఆప్‌ తరఫున షెల్లీ ఒబెరాయ్‌ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. మొదటి మేయర్ ఎన్నిక పోటీ చేయడంలేదన్న బీజేపీ .. తర్వాత మాట మార్చింది. దీంతో వివాదం మొదలైంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలన్నర దాటినా ఇంకా మేయర్‌ ప్రక్రియ పూర్తికాలేదు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×