EPAPER

Delhi Liquor Policy | నిజాయితీ ఒక్కటే నా ఆస్తి.. బీజేపీ బురద చల్లాలనుకుంటోంది : కేజ్రీవాల్

Delhi Liquor Policy | ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మూడోసారి జారీ చేసిన సమన్లపై కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. ఆయన బుధవారం ఈడీ విచారణకు మరోసారి గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Delhi Liquor Policy | నిజాయితీ ఒక్కటే నా ఆస్తి.. బీజేపీ బురద చల్లాలనుకుంటోంది : కేజ్రీవాల్

Delhi Liquor Policy | ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మూడోసారి జారీ చేసిన సమన్లపై కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. ఆయన బుధవారం ఈడీ విచారణకు మరోసారి గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెబుతున్నారు.


లిక్కర్ పాలసీ కేసు(మద్యం కుంభకోణం)లో అవినీతి ఆరోపణలపై రెండేళ్లగా ఈడీ విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాని ఈడీ అరెస్టు చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను విచారణ హాజరు కావాలని ఈడీ సమన్లు పంపినా ఆయన గైర్హాజయ్యారు. దీంతో త్వరలోనే ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేసి, ఆయన ఇంటిని సోదా చేస్తారని సమాచారం.

దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘రెండేళ్లుగా ఈ మద్యం కుంభకోణం వార్తలు వింటూనే ఉన్నాం. బిజేపీ ఏజెన్సీలు (సిబిఐ, ఈడీ) అనేక మందిని అరెస్టు చేశాయి. అనేక ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. కానీ ఇంతవరకూ అవినీతి సోమ్ము ఒక్క పైసా కూడా బయటపడలేదు. ఒకవేళ నిజంగా అవినీతి, కుంభకోణం లాంటివి జరిగి ఉంటే ఆ కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి? ఈడీ జారీ చేసిన సమన్లు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికీ ఈడీ దృష్టికి తీసుకెళ్లాను. వాళ్లు మాత్రం స్పందించలేదు. కేవలం నన్ను అరెస్టు చేయడానికే విచారణకు పిలుస్తున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో నేను ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఇదంతా బిజేపీ చేస్తున్న కుట్ర. మచ్చలేని నిజాయితీ ఒక్కటే నా ఆస్తి.. దానిపై బిజేపీ బురద చల్లాలనుకుంటోంది ” అని అన్నారు.


Related News

Haryana Cashless Treatment: రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం.. హర్యాణాలో కొత్త పథకం!

Chhattisgarh Bomb Blast| ఛత్తీస్ గడ్ లో బాంబు పేల్చిన నక్సల్స్.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి, నలుగురికి గాయాలు

Parenting Tips : మీ పిల్లాడు జెంటిల్‌మెన్ కావాలంటే.. ఈ టిప్స్ చాలు..!

Ayodhya : ఈ చారిత్రక వేడుకకు సాక్ష్యమవడం సంతోషంగా ఉంది.. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ ట్వీట్..

Sperm Count : రోజూ ఇలా చేస్తే.. మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

Mopidevi Temple : ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే.. వివాహం, సంతాన యోగం..!

Plastic Bottle : మీ చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఉందా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!

Big Stories

×