EPAPER

Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..15 దుకాణాలు దగ్ధం

Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..15 దుకాణాలు దగ్ధం

Massive fire breaks out at Delhi Mayur Vihar cafe: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మయూర్‌ విహార్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 15కుపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. మొదటగా యూనిఫాం తయారీ దుకాణంతో పాటు కేఫ్‌లలో మంటలు వ్యాపించాయి. తర్వాత ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 25 ఫైర్ ఇంజిన్ వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో చికుక్కున్న పలువురిని రక్షించారు. ఈ ఘటనలో గాయాలై కిందపడిన ఓ వ్యక్తిని ఫైర్ సిబ్బంది కాపాడారు. అయితే మంటలను అతికష్టం మీద పైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఓ భవనంలో వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడంతో మంటలు వ్యాపించాయని అధికారులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే వరకే మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఓ కాంప్లెక్స్‌లో మొత్తం 30 దుకాణాలు ఉండగా.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.


Also Read: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఇదిలా ఉండగా, అర్ధరాత్రి చావడి బజార్‌లోని ఓ గోదాం కుప్పకూలింది. ఇందులో నిద్రిస్తున్న ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వెంటనే స్థానికులు లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. వీరికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలకు తలతోపాటు కాళ్లకు గాయాలయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×