EPAPER

Dating App: డేటింగ్ యాప్ స్కామ్.. ముగ్గురిని ట్రాప్ చేసిన యువతి

Dating App: డేటింగ్ యాప్ స్కామ్.. ముగ్గురిని ట్రాప్ చేసిన యువతి

Fraud: డేటింగ్ యాప్‌ల ద్వారా జరిగే నేరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డేటింగ్ యాప్‌ల ద్వారా వల వేసి అఘాయిత్యాలకు పాల్పడ్డ ఘటనలు కొన్నైతే.. నేరుగా కలుద్దామని పిలిచి డబ్బులు వసూలు చేసుకున్న ఘటనలు మరికొన్ని. ఇప్పుడు డేటింగ్ యాప్ ద్వారా పురుషులను వలలో వేసుకుని సుతిమెత్తంగా మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్‌లో యువతి వల వేస్తుంది. సుకుమారంగా మాట్లాడి.. రంగంలోకి దింపుతుంది. ఆ తర్వాత డేటింగ్‌కు రావాలని కోరుతుంది. కాస్ట్లీ పబ్‌కు తీసుకెళ్లి కుచ్చుటోపి పెట్టి జారుకుంటుంది.


ఈ స్కామ్‌ను బట్టబయలు చేస్తూ యాక్టివిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఆ యాక్టివిస్ట్ ఈ స్కామ్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి సంచలన విషయాలను వెల్లడించింది. ‘ముంబయి డేటింగ్ స్కామ్ బట్టబయలైంది. ఆంధేరి వెస్ట్‌లోని గాడ్ ఫాదర్ క్లబ్ ప్రతి రోజూ స్కామ్ చేస్తున్నది. 12 మంది బాధితులు టచ్‌లో ఉన్నారు. టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లతో ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత క్లబ్‌లో రూ. 23 వేల నుంచి రూ. 61 వేల వరకు బిల్లులతో వారి జేబుకు చిల్లు పెడుతున్నారు. ముగ్గురు పురుషులను ఇలా ఒకే యువతి ట్రాప్ చేసింది’ అని నారాయణ్ భరద్వాజ్ ట్వీట్ చేసింది.

టిండర్, బంబుల్, హింగె, ఓకే క్యూపిడ్ వంటి డేటింగ్ యాప్‌లలో ఈ స్కామ్ మొదలవుతుందని ఆమె చెప్పింది. ఈ డేటింగ్ యాప్‌లలో పురుషులకు యువతి వల వేస్తుంది. ఆ తర్వాత ఫేస్ టు ఫేస్ కలుద్దామని కోరుతుంది. కలిశాక.. ఈ రోజు ఎంజాయ్ చేద్దామంటూ లగ్జరీ పబ్ లేదా క్లబ్‌కు తీసుకెళ్లుతుంది. అక్కడికి వెళ్లాక ఖరీదైన ఐటమ్స్ కావాలని కోరుతుంది. ఖరీదైన మద్యం లేదా హుక్కా వంటివి ఆర్డర్ చేస్తుంది. అసలు మెనూలో లేనివి కూడా ఆర్డర్ పెడుతుంది.


Also Read: N Convention: నాగార్జున వర్సెస్ హైడ్రా.. ఎవరేమంటున్నారు? ఏం జరిగింది?

అవి తీసుకువచ్చిన తర్వాత కొంతసేపటికే ఒక ఎమర్జెన్సీ పని ఉన్నదని యువతి మెల్లగా జారుకుంటుంది. అక్కడ మిగిలిన ఆ బాధితుడు బుక్ అవుతాడు. బిల్లు కట్టనంటే.. సిబ్బంది చుట్టూ చేరి బెదిరిస్తారు. చివరికి బిక్కు బిక్కుమంటూ బిల్లు చెల్లించి బయటపడతారు. ఇలా స్కామ్ జరుగుతున్నదని నారాయణ్ భరద్వాజ్ వివరించింది.

ఇలాంటి ఘటనలు కేవలం ముంబయిలోనే కాదు.. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా వెలుగుచూశాయి. ఈ క్లబ్ లేదా పబ్ నిర్వాహకులే యువతులతో డీల్ చేసుకుని ఇలా అమాయకులను డేటింగ్ యాప్‌ల ద్వారా బుక్ చేసి మోసం చేస్తున్నారన్నట్టుగా ఆమె వివరించింది. ఢిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ అయితే.. ఇలా రూ. 1.2 లక్షల బిల్లు కట్టాడు.

Related News

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Big Stories

×