EPAPER

CUET-UG 2024: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..

CUET-UG 2024: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..
CUET-UG 2024 Registration Open
CUET-UG 2024 Registration Open

CUET-UG 2024 Registration Open: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET-UG 2024) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి మే 31, 2024 మధ్య నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్ 30న ప్రకటిస్తారు.


CUET-PG 2024కి సంబంధించిన సబ్జెక్ట్ వారీ తేదీలను కూడా ఎన్టీఏ ప్రకటించింది. మార్చి 3, 2024 మంగళవారం ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి.

ఇక CUET UG 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ఫిబ్రవరి 26 (11:50 PM) నుంచి మార్చి 26 ((11:50 PM) వరకు కొనసాగుతుంది.


కరెక్షన్ విండో రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. మార్చి 28,29 (11:50 PM)న అభ్యర్ధులు కరెక్షన్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు పరీక్ష జరిగే నగరం వివరాలు ఏప్రిల్ 30, 2024 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

Read More: SSC Notification 2024: ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 26నుంచి ధరఖాస్తులు ప్రారంభం

గత సంవత్సరం, CUET-UG కోసం టెస్టింగ్ సుమారు 14.9 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. “2024-25 అకడమిక్ సెషన్ కోసం, CUET (UG) – 2024 హైబ్రిడ్ మోడ్ (కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBT) / పెన్ & పేపర్)లో నిర్వహించబడుతుంది” అని NTA మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

2022లో ప్రవేశపెట్టబడిన CUET-UG, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో సహా ఏదైనా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లేదా ఇతర భాగస్వామ్య సంస్థలలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు సింగిల్ విండో అవకాశాన్ని అందిస్తుంది.

పోటీ పరీక్ష మొత్తం 13 భాషలలో నిర్వహిస్తారు- ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ. భారతదేశం వెలుపల 26 నగరాలతో సహా మొత్తం 380 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

Tags

Related News

kolkatta doctor case: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Big Stories

×