EPAPER

Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం.. మరింత విషమించడంతో కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.


సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో సర్వేశ్వర సోమయాజులు ఏచూరి – కల్పకం ఏచూరి దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ లో 10వ తరగతి వరకూ చదువుకున్న సీతారాం.. ఆ తర్వాత ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ (ఆనర్స్) చదివారు. జేఎన్ యూలో ఎంఏ (ఎకనామిక్స్) చేశారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే ఫ్యామిలీ!


1974లో సీతారాం ఏచూరి ఎస్ఎఫ్ఐ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. జేఎన్ యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికైన ఆయన.. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 3 సార్లు జేఎన్ యూ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1999లో పోలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. జేఎన్ యూ ను వామపక్షాల కంచుకోటగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.

2005లో సీతారాం ఏచూరి తొలిసారి బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. 2015, 2018, 2022 సంవత్సరాల్లో వరుసగా సీపీఎం జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్య సభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.

ఐడియా ఆఫ్ ఇండియా

సీతారాం ఏచూరి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సానుభూతి తెలిపారు. మన దేశం గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఆయన అని, ఐడియా ఆఫ్ ఇండియాకు ఆయన రక్షకుడని రాహుల్ గాంధీ కొనియాడారు. “మనం చేసే సుదీర్ఘ చర్చలను నేను కోల్పోతాను. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని X వేదికగా ట్వీట్ చేశారు.

Related News

Jammu Kashmir Elections: పదేళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు.. అందరికీ అగ్నిపరీక్షే!

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Toll Gate: ఏమిటీ ఈ దారుణం.. రోడ్డు నిర్మాణ ఖర్చు కంటే నాలుగు రెట్లు అధికంగా టోల్ వసూళ్లు.. కేంద్రం ఏమంటున్నదంటే?

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కూల్చివేతలు చేయొద్దు

Adhaar card: ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అప్ డేట్ గడువు పొడిగించిన కేంద్రం

Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా ?

Narendra Modi: మోదీ నిజంగానే చాయ్‌వాలానా? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

Big Stories

×