Corona : చైనాలో మరోసారి కోవిడ్‌ కలకలం.. భారీగా పెరుగుతున్న కేసులు..

Corona : కరోనా సమయంలో కుదేలైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అమెరికా తర్వాత అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా పరిస్థితి కూడా అంతే. కానీ ఇప్పుడు చైనాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. తాజాగా చైనాలో పెరుగుతున్న కరోనా కేసులపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ను నియంత్రించడంలో చైనా విజయం సాధించినప్పటికీ, కఠినమైన జీరో కోవిడ్ విధానాన్ని వదిలేసింది. దీని పరిణామాలు భయంకరంగా ఉండవచ్చు. జూన్ చివరి నాటికి కోవిడ్-19 కేసులు వారానికి 6.5 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

ప్రఖ్యాత శ్వాసకోశ వ్యాధుల నిపుణులు జాంగ్ నాన్షాన్ చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ఒక సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కొత్త XBB ఒమిక్రాన్‌ వేరియంట్ ఆవిర్భావంతో ప్రస్తుత ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. దీని కారణంగా ఏప్రిల్ చివరి నుంచి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని స్పష్టం చేశారు. చైనాలో కోవిడ్-19 కేసులు జూన్‌ చివరికి వారానికి 65 మిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకుంటుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఉప్పెనను ఎదుర్కొనేందుకు, XBB వేరియంట్‌ను అడ్డుకునేందుకు కొత్త వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడంపై చైనా దృష్టి సారించింది.

చైనా CDC వీక్లీ పాండమిక్ నివేదిక ప్రకారం Covid-19 కేసులు వరుసగా రెండు వారాల పాటు ఇన్ఫ్లయెంజా కేసులను అధిగమించాయని.. దేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న వ్యాధిగా అగ్రస్థానాన్ని పొందాయని వెల్లడించింది. బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌ వంటి ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులు ఇప్పటికే రద్దీని ఎదుర్కొంటున్నాయి. ఇది గతేడాది చివరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు సంభవించిన మునుపటి వేవ్‌ను గుర్తు చేస్తోంది.

కోవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. జీరో కోవిడ్ విధానాన్ని వదలివేయాలనే నిర్ణయం జనాభాను అధిక ప్రమాదానికి గురిచేసింది. XBB Omicron వేరియంట్ ఆవిర్భావం పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసింది. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున, వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అధికారులు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడం చాలా ముఖ్యం. ఈ కొత్త వేవ్ ప్రభావంతో చైనా సతమతమవుతున్నందున.. రాబోయే వారాలు సవాలుగా మారనున్నాయి. ఆరోగ్య సంక్షోభాన్ని మేనేజ్‌ చేయడం, ఆర్థిక పరిణామాలను తగ్గించడం మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నించాలి. వ్యాక్సిన్‌ తయారీని ప్రోత్సహించాలి.

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

China Corona : కరోనా కట్టడిలో చైనా ఫెయిల్ అయిందా..?

Covid: దేశంలో కరోనా హైఅలర్ట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..

Corona Virus : చైనాలో 4 కొత్త కరోనా వేరియంట్లు.. భారత్ అప్రమత్తం..

Corona Alert: రాహుల్ టార్గెట్ గానే కరోనా అలర్ట్?.. కావాలనే కొత్త వేరియంట్ పై కలకలం?