Big Stories

Karnataka : 5 ఏళ్లూ సిద్ధూనే సీఎం.. మంత్రి కామెంట్స్.. డీకే రియాక్షన్ ఏంటంటే..?

Karnataka : కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో సీఎం పదవి పంపకంపై అప్పడే రచ్చ మొదలైంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పాటై వారంరోజులు గడవకముందే అధికార పంపిణీపై వివాదం రాజుకుంది. ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో హీట్ పుట్టించాయి. పూర్తికాలం ఐదేళ్లపాటు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎంబీ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో మళ్లీ రచ్చ మొదలైంది.

- Advertisement -

ఎంబీ పాటిల్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించడం ఆసక్తిని రేపింది. అయితే ఆయన ఈ విషయంపై ఘాటు వ్యాఖ్యలు ఏమి చేయకుండా అచితూచి స్పందించారు. అధికార పంపిణీపై ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా తాను పట్టించుకోన్నారు. ఆ విషయంపై తానేమి మాట్లాడనని స్పష్టం చేశారు. అధికార పంపిణీ, ఇతర కీలక విషయాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నేతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యమిస్తామన్నారు.

- Advertisement -

ఎంబీ పాటిల్ కామెంట్స్ పై డీకే శివకుమార్‌ సోదరుడు ఎంపీ డీకే సురేశ్‌ కూడా స్పందించారు. అది ఇప్పుడు చర్చించే అంశం కాదన్నారు. ఇది ఏఐసీసీ స్థాయిలో చర్చించే అంశంగా పేర్కొన్నారు. తొలుత రెండేళ్లు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని.. ఆ తర్వాత మూడేళ్లు డీకేకి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్ లో తొలి నుంచి ప్రచారం జరుగుతోంది.

అసలు సీఎం అభ్యర్థి ఎంపిక సమయంలో సిద్ధరామయ్యే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని వార్తలు వచ్చాయి. కానీ డీకే అందుకు ఒప్పుకోలేదని.. తనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారని సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇదే ప్రతిపాదన చేయడంతో డీకే చివరకు వెనక్కి తగ్గారని టాక్. ఈ అంశంపై అటు సిద్ధరామయ్య, డీకే కానీ ఇటు కాంగ్రెస్ అధిష్టానం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి మంత్రి ఎంబీ పాటిల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి డీకే తీసుకెళతారా..? మరి హైకమాండ్ యాక్షన్ ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది.

మరోవైపు ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు కేబినెట్ విస్తరణపై సీఎం సిద్ధరామయ్య దృష్టిపెట్టారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో కలిసి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గంలోకి ఇంకా ఎవరెవరిని తీసుకోవాలో ఏఐసీసీ నేతలతో చర్చించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News