EPAPER
Kirrak Couples Episode 1

Modi’s Ayodhya trap : కాంగ్రెస్ మరోసారి మోదీ ఉచ్చులో పడుతోందా..?

Congress in Modi’s trap : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మరికొన్ని గంటల్లో జరగనుంది. రాముడు నడయాడిన అయోధ్యలో నిర్మించిన మందిరంలో బాల రాముడు కొలువుదీరబోతున్నాడు. సుమారు 500 ఏళ్ల రామభక్తుల కల సాకారం కాబోతున్న ఈ వేళ.. ఈ విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి రామజన్మభూమీ తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. దేశ, విదేశాలకు చెందిన 7 వేల మంది అతిథుల సమక్షంలో రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగబోతోంది.

Modi’s Ayodhya trap : కాంగ్రెస్ మరోసారి మోదీ ఉచ్చులో పడుతోందా..?

Modi’s Ayodhya trap : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మరికొన్ని గంటల్లో జరగనుంది. రాముడు నడయాడిన అయోధ్యలో నిర్మించిన మందిరంలో బాల రాముడు కొలువుదీరబోతున్నాడు. సుమారు 500 ఏళ్ల రామభక్తుల కల సాకారం కాబోతున్న ఈ వేళ.. ఈ విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి రామజన్మభూమీ తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. దేశ, విదేశాలకు చెందిన 7 వేల మంది అతిథుల సమక్షంలో రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగబోతోంది.


ఇక, మందిర ప్రారంభోత్సవానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అందరితోపాటు కాంగ్రెస్‌ పెద్దలను కూడా ఆయోధ్యకు రావాలని ట్రస్టు ఆహ్వానం పంపించింది. అయితే, రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నాయని, ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీఏ కన్వీనర్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు.

అయితే.. అయోధ్య ప్రాణ ప్రతిష్టకు దూరంగా ఉండాలన్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని పలువురు మేధావులు తప్పు పడుతున్నారు. ఎలాంటి ఆహ్వానం లేకున్నా.. 1959లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అప్ఘానిస్థాన్‌లోని బాబరు సమాధిని సందర్శించారని, ఆయన తర్వాత 1968లో నాటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ, 2005లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా బాబర్‌ సమాధిని దర్శించుకున్నారనే సంగతిని వారు గుర్తుచేస్తున్నారు.


బాబర్‌ సేనాని నిర్మించిన మసీదు.. పురాతన విష్ణు ఆలయంపై నిర్మితమైందనే సంగతిని భారత పురావస్తు శాఖ శాస్త్రీయమైన ఆధారాలతో నిర్ధారించిన తర్వాత, దేశపు సర్వోన్నత న్యాయస్థానం దీనిపై స్పష్టమైన, వివాదరహితమైన రీతిలో తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కీలక రాజకీయ పక్షమైన కాంగ్రెస్ ఇలా కార్యక్రమాన్ని బహిష్కరించటం సరికాదని వారు అంటున్నారు.

హిందూ మెజారిటీ దేశమైన భారత్‌లో కీలక ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్.. 500 ఏళ్ల పోరాటం, సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత ఏర్పాటవుతున్న రామమందిర కార్యక్రమానికి హాజరైతే బాగుంటుందని, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని ఆయా రంగాల మేధావులు అభిప్రాయపడుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపంలో ఉన్న వేళ.. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి సమాజంలోని అన్ని శ్రేణులు మద్దతు పలుకుతున్న కీలక సందర్భంలో కాంగ్రెస్ తాజా నిర్ణయం వచ్చే ఎన్నికల్లో పాలక పక్షానికి అందివచ్చిన వరంగా మారుతుందని, దీనివల్ల గత పదేళ్లుగా కాంగ్రెస్ చేసిన పోరాటాలన్నీ కాంగ్రెస్ తాజా నిర్ణయంతో వృధా అయ్యే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.

రామ మందిరపు తలుపులు తెరిచిన నేతగా రాజీవ్ గాంధీ నాడు రాజకీయ పరంగా రిస్కుతో కూడిన నిర్ణయం తీసుకున్నారని వారు గుర్తుచేస్తున్నారు. రామ జన్మభూమి ఉద్యమం తర్వాతే.. ఒకనాడు ఏకపక్షంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. తన ఓటు బ్యాంకును కోల్పోతూ వస్తోందని, దీనివల్లనే అది 2004లోనూ భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి యూపీఏ సర్కారును ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వారు గుర్తుచేస్తున్నారు.

ఎంతో ఫామ్‌లో ఉన్న మోదీని కాదని కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టంగట్టారనీ, రాహుల్ తదుపరి పాదయాత్ర కొనసాగుతున్న వేళ.. అయోధ్య కార్యక్రమానికి ముఖం చాటేయటం రాజకీయంగా ఆత్మహత్యాసదృశమైన నిర్ణయమని వారు కాంగ్రెస్ నేతలకు సూచిస్తున్నారు. కాంగ్రెస్‌ను హిందూ ఓటర్లకు దూరం చేసేందుకు మోదీ పన్నిన ఉచ్చులో కాంగ్రెస్ చిక్కుకోబోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాలుగా నలిగిన రామమందిర అంశం.. రేపటి ప్రాణ ప్రతిష్ఠతో పరిష్కార మవుతున్న వేళ, ఆ కార్యక్రమానికి నలుగురితో బాటు హాజరై, తర్వాత అంశాల ప్రాతిపదికన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటం ద్వారానే మోదీకి వచ్చే ఎన్నికల్లో అడ్డుకట్ట వేయవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Software Engineer: లోదుస్తుల్లో ఉండి.. కరెంట్ తీగ బాడీకి చుట్టేసుకుని.. వర్క్ ప్రెజర్ తట్టుకోలేక టెకీ ఏం చేశాడంటే?

Manish Sisodia: నా కొడుకు చదువు కోసం డబ్బుల్లేక చాలామందిని అడగాల్సి వచ్చింది: మనీశ్ సిసోడియా

Amit Shah: మీకు ఆ దమ్ముందా? : అమిత్ షా

Techie Suicide Work Pressure: పని ఒత్తిడి వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?..

Attempt to Train accident: మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. అరె ఏమైంది రా.. ఇలా చేస్తున్నారు!

FlyOver Collapse: కూలిన ఫ్లై ఓవర్.. స్పాట్ లో 60 మంది ?

Atishi Marlena Oath: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

Big Stories

×