EPAPER

Congress Promises to Women: మహిళలకు కాంగ్రెస్ వరాల జల్లు.. ఏడాదికి లక్షరూపాయలు.. ఉద్యోగాల్లో 50% కోటా!

Congress Promises to Women: మహిళలకు కాంగ్రెస్ వరాల జల్లు.. ఏడాదికి లక్షరూపాయలు.. ఉద్యోగాల్లో 50% కోటా!


Congress Promises to Women for Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో రెండ్రోజుల్లో ఈసీ షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ వార్తల నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా 5 గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో ఒక.. పేద కుటుంబాల్లోని మహిళలకు ప్రతి ఏటా లక్షరూపాయలను అందజేయనున్నట్లు తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాలలో కొత్త చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50 శాతం కోటా ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది.

నారీ న్యాయ్ (Nari Nyay) పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ హామీని ప్రకటించారు. మహారాష్ట్రలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తం 5 గ్యారెంటీలను ఆయన ప్రకటించారు.


మహిళలకోసం ప్రత్యేకంగా ప్రకటించిన ఐదు గ్యారెంటీలు ఇవే..

Mahalakshmi Scheme : ఈ పథకం కింద ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా లక్ష రూపాయల నగదును వారి ఖాతాలోకే నేరుగా బదిలీ చేస్తారు.

Also Read: కేబినెట్ మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం

Aadhi Aabadi Pura Hakk : కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఈ పథకం ఉద్దేశం.

Shakti ka Sammaan : ఆశా, అంగన్వాడీలు, మధ్యాహ్నభోజన పథకాలలో విధులు నిర్వర్తిస్తున్న మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటాను రెట్టింపు చేయడం.

Adhikar Maitri : న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్ది.. వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతీ పంచాయతీలో అధికార్ మైత్రీని నియమిస్తారు.

Savitribai Phule Hostel : ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వమే ఒక హాస్టల్ ను ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడున్న హాస్టళ్లను రెట్టింపు చేస్తుంది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×