EPAPER

Kashmir Marathon: 2 గంటల్లో 21 కిమీ పరుగెత్తిన ముఖ్యమంత్రి.. ‘ట్రైనింగ్ లేకుండానే సాధించాను’

Kashmir Marathon: 2 గంటల్లో 21 కిమీ పరుగెత్తిన ముఖ్యమంత్రి.. ‘ట్రైనింగ్ లేకుండానే సాధించాను’

Kashmir Marathon| జమ్మూ కశ్మీర్ కొత్త ముఖ్యమంత్రి,నేషనల్ కాన్ఫెరెన్స నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఒక వ్యక్తిగత రికార్డు సాధించారు. ఆదివారం అక్బోర్ 20, 2024 ఉదయం ఆయన 2 గంటల సమయంలో 21 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా పరుగెత్తి ఈ రికార్డు సాధించారు. జమ్ము కశ్మీర్ లో టూరిజంని ప్రమోట్ చేయడానికి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అంతర్జాతీయ మారథాన్ ని ఆదివారం నిర్వహించింది. ఈ మారథాన్ లో భాగంగానే ఆయన పలువురు సెలబ్రిటీలు, జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్లతో కలిసి పరుగులు తీశారు.


మారథాన్ లో ఆయన పరుగులు తీస్తూ.. కేవలం 5 నిమిషాల 54 సెకన్లకు ఒక కిలోమీటర్ల వేగంతో 21 కిలోమీటర్లు పరుగెత్తానని తెలియజేస్తూ.. ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఈ పరుగు పూర్తి చేయడంతో తాను కశ్మీర్ హాఫ్ మారథాన్ పూర్తి చేశానని ట్వీట్ లో తెలిపారు.

Also Read: రాజకీయాలను జయించిన ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన బిజేపీ నాయకుడి కుమారుడు..


54 ఏళ్ల ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన రికార్డు గురించి వివరిస్తూ.. ”నేను నా జీవితంలో 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పరుగెత్త లేదు. అది కూడా ఒకసారి మాత్రమే పరుగెత్తాను. కానీ ఈ రోజు మాత్రం అలా పరుగు తీస్తూనే ముందుకు సాగిపోయాను. ఎటువంటి శిక్షణ తీసుకోలేదు, ఏ విధమైన ప్లానింగ్ చేయలేదు, పౌష్టికాహారం కూడా రన్నింగ్ చేసే ముందు తీసుకోలేదు. ఒక అరటిపండు, రెండు ఖర్జూరాలు దారిలో కాస్త తీసుకున్నాను. నాతో పాటు పరుగులు తీసే సామాన్యుల ఉత్సాహం చూసి నాలో కూడా పరుగు తీయాలని ఉత్సాహం కలిగింది. దారిలో నా ఇంటి మీదుగా వెళ్లాను, నా కుటుంబ సభ్యులంతా నన్ను ప్రోత్సహించడంతో మరింత ఉత్సాహంగా పరుగెత్తాను.” అని ఆయన పోస్ట్ చేశారు.

సిఎం అబ్దుల్లా పరుగులు తీస్తూ.. అందమైన దాల్ సరస్సు మీదుగా వెళ్లారు. అక్కడి దృశ్యాలను చూపుతూ.. కశ్మీర్ అందాన్ని పొగిడారు. మరాథాన్ సమయంలో ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. తనతో పాటు చాలామంది విలేకరులు, సామాన్యలు కూడా వచ్చారని.. వారంతా తన అపాయింట్ మెంట్ కోరుతున్నారని తెలిపారు. విలేకరులైతే తన ఇంటర్‌వ్యూ కావాలని అడుగుతున్నట్లు చెప్పారు.

చాలామంది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి తనకు తెలియజేశారని, తమ సమస్యలు చెప్పుకోవడానికి తన అపాయింట్‌మెంట్ కోరుతున్నారని వెల్లడించారు. మారథాన్ లో రన్నింగ్ గురించి సిఎం అబ్దుల్లా వివరిస్తూ.. ఒత్తిడి జయించడానికి డ్రగ్స్ తీసుకునేవారు రన్నింగ్ చేయాలని సలహా ఇచ్చారు. మారథాన్ లో కానీ, లేదా ఖాళీ సమయంలో ఒక కిలోమీటర్ పరిగెత్తితే శరీరం అలసిపోయి.. ఒత్తిడి దూరమవుతుందని.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించడానికి ఇలాంటి మారథాన్ లు ఉపయోగపడతాయాని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ మారథాన్ లో ఒక సీనియర్ పౌరుడు వాయు కాలుష్యం గురించి చెప్పిన సంగతిని గుర్తుకు చేస్తూ.. వారందరూ కశ్మీర్ లో వచ్చి రన్నింగ్ చేయాలని.. కశ్మీర్ లో వాయు కాలుష్యం లేదని.. మంచి వాతావరణంతో పాటు ఇప్పుడు కశ్మీర్ సురక్షితమైన ప్రదేశమని.. అందరూ కశ్మీర్ లో పర్యటించాలని చెబుతూ కశ్మీర్ లోయలో టూరిజంని ప్రమోట్ చేశారు.

ఇటీవల జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు 48 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత కశ్మీర్ లో అంతర్జాతీయ మారథాన్ ని రాజధాని శ్రీ నగర్ పోలో స్టేడియం నుంచి ప్రారంభించారు. నటులు సునీల్ శెట్టి కూడా మారథాన్ లో పాల్గొని కశ్మీర్ అందాలను పొగిడారు. ఆయన అందరూ కశ్మీర్ లో పర్యటించాలని కోరారు.

Related News

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Jharkhand Bjp : ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

Navya Haridas BJP : ప్రియాంక గాంధీపై పోటీకి సై అంటున్న న‌వ్య హ‌రిదాస్‌, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న వయనాడ్, నీదా నాదా అంటున్న కాంగ్రెస్, బీజేపీ

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీ కొట్టిన బస్సు-12 మంది మృతి

Railway fines Police: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే పోలీసులు.. అడిగితే అధికారులకు బెదిరింపులు

Delhi Bomb Blast: ఢిల్లీలో బాంబు పేలుడు.. సిఆర్‌పిఎఫ్ స్కూల్ వద్ద ఘటన!

Big Stories

×