EPAPER

Justice D.Y. Chandrachud: న్యాయపక్రియతో ప్రజలు విసుగెత్తిపోయారు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు

Justice D.Y. Chandrachud: న్యాయపక్రియతో ప్రజలు విసుగెత్తిపోయారు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు

సీజేఐ చంద్రచూడ్ ఓ రియల్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నారు. పరిహారం విషయంలో కోర్టుల చుట్టూ తిరిగేందుకు ఓపిక లేక.. ఓ వ్యక్తి ఎంత వీలైతే అంత ఇప్పించండి అంటూ సెటిల్‌మెంట్‌కు వచ్చేశాడట. అంటే కోర్టుల్లో న్యాయం జరుగుతుందని నమ్మకం లేక ప్రజలు చివరికి ఇలా లోక్‌ అదాలత్‌లలో సెటిల్ చేసుకుంటున్నారని చెప్తున్నారు సీజేఐ.. ఆయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం మాములు విషయం కాదు. ప్రజల్లో కోర్టుల్లో ఉన్న అభిప్రాయాన్ని ఇది తెలుపుతుంది. అంతేకాదు కోర్టుల్లో న్యాయం జరగదన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతుందన్న భయాన్ని కూడా ఆయన తెలుపుతున్నారు.. 75 ఏళ్ల సుప్రీంకోర్టు వారోత్సవాల్లో భాగంగా లోక్ అదాలత్‌ వీక్‌ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో మాట్లాడుతూ చీఫ్‌ జస్టిస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజానికి కోర్టు అంటేనే సామాన్యుడు భయపడతాడు. మనం కూడా చాలా చోట్లు వింటూనే ఉంటాం. కేసులు, కోర్టులు ఎందుకు.. ? మ్యాటర్ ఏదైనా ఉంటే మనం మనం సెటిల్‌ చేసుకుందాం అని అంటుంటా.. అంటూంటే వింటా ఉంటాం.. ఎందుకంటే అలాంటి కేసులు మన చుట్టూ చాలానే జరిగాయి. రీసెంట్‌గా ఓ లంచం తీసుకున్న కేసులో కోర్టు తీర్పు వచ్చింది. కానీ అప్పటికే 20 ఏళ్లు గడిచిపోయింది. ఆయన ఉద్యోగంలో నుంచి రిటైర్ కూడా అయిపోయారు. లక్షలు ఖర్చు పెట్టించి.. ఆస్తులు అమ్మించి.. ఏటూ తేల్చకుండా తరతరాలుగా వాయిదా పడుతున్న కేసులు మనకు కనిపిస్తూనే ఉంటాయి.. వినిపిస్తూనే ఉంటాయి.


దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులెన్నో తెలుసా? అక్షరాలా 5 కోట్లకు పైగా. ఇది నోటి మాట కాదు.. పార్లమెంట్‌లో కేంద్రన్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ చెప్పిన విషయం ఇది. ఇందులో లాస్ట్ ఫైవ్‌ మంత్స్‌లో ఏకంగా 10 వేల కేసులు సుప్రీంకోర్టులో ఫైలయ్యాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 84 వేల 280 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఓవరాల్‌లో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో ఏకంగా 4 కోట్ల 53 లక్షల 51 వేల 913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోనే కోటి 18 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది మన న్యాయశాఖ పరిస్థితి.

Also Read: గవర్నర్లు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారారా?

నిజానికి కోర్టుల సంఖ్య అనుకున్నంత స్థాయిలో పెరగడం లేదు. జడ్జ్‌ల సంఖ్య కూడా అంత వేగంగా పెరగడం లేదు.. ఈ విషయాలను పక్కన పెడితే.. కేసులను విచారించడానికి ఓ కాలపరిమితి లేదు. వాయిదాల మీద వాయిదాలు వేయడం. విచారణను పర్యవేక్షించడం.. ట్రాక్‌ చేయడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం. కోర్టుల్లో సరిపడా సౌకర్యాలు లేకపోవడం. కేసుల్లోని వాస్తవాలు తేల్చేందుకు ఇబ్బందులు ఎదురవడం.. సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా సవాలక్ష కారణాలు. వీటన్నింటిని దాటుకొని కేసు ఓ కొలిక్కి వచ్చి తీర్పు వచ్చే వరకు పుణ్యకాలం గడిచిపోతుంది. పోనీ తీర్పు వచ్చాక అయినా ఆగుతుందా అంటే.. అది జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు.. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు.. ఇలా అనేక కోర్టులకు ప్రయాణీస్తుంది.

నిజానికి న్యాయవ్యవస్థ అంటే భయపడి చాలా మంది బయటే సెటిల్‌మెంట్లు చేసేసుకుంటారు. అలా ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది. వీరందరూ కూడా కోర్టుకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయమెస్తుంది. పది మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ.. ఒక్క దోషికి కూడా శిక్ష పడొద్దు అంటోంది మన న్యాయవ్యవస్థ.. అందుకే ప్రతి విషయాన్ని కులంకశంగా పరిశీలిస్తుంది. కానీ ఆ నియమాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని ఉపయోగించుకునే వారే ఎక్కువ. CJI చంద్రచూడే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారంటే.. న్యాయవ్యవస్థలో ఇంకా మార్పు రావాలనేది అర్థమవుతుంది. ఆయన చెప్పడం వరకే కాకుండా.. వ్యవస్థను మార్చితే సంతోషించేది మొదట సామాన్య ప్రజలే.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×