EPAPER

Indian Railways: మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా ఉండాల్సిందే

Indian Railways: మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా ఉండాల్సిందే

Pakistan Visa: ఎవరికైనా పాస్‌పోర్టు, వీసా ఎప్పుడు అవసరముంటుంది? వేరే దేశానికి వెళ్లితేనే కదా! కానీ, భారత్‌లోనే ఉండే ఈ రైల్వే స్టేషన్‌లో మాత్రం ప్రయాణికులు తప్పనిసరిగా పాస్‌పోర్టు, వీసా తీసుకెళ్లాలి. లేదంటే.. ఆ స్టేషన్‌లో అడుగుపెట్టనివ్వరు. అంతేకాదు, ఈ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నిత్యం సీసీటీవీల నిఘా నీడలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్‌లోకి కనీసం పోర్టర్లను కూడా అనుమతించరు. ఎవరి లగేజీ వారే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంతటి కఠినమైన నిబంధనలు ఉన్నా.. ఈ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా?


ఈ రైల్వే స్టేషన్ నార్తర్న్ రైల్వేలోని ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో ఈ రైల్వే స్టేషన్ ఉన్నది. అదే పంజాబ్‌లోని అత్తారి శ్యాం సింగ్ రైల్వే స్టేషన్‌. ఇది ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య వ్యూహత్మక ప్రాంతంలో ఉండటం చేత ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అమృత్‌సర్ – లాహోర్ లైన్‌లో భారత్ వైపున్న చివరి రైల్వే స్టేషన్ ఇది.

ఉభయ దేశాల మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రజలు తమ ప్రయాణాలు చేసేవారు. రెండు దేశాలను కలిపే ఈ ఎక్స్‌ప్రెస్.. ఉభయ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడంతో నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్ సేవలు అందించినప్పుడు ఈ అత్తారి రైల్వే స్టేషన్‌లోనే ప్రయాణాన్ని ప్రారంభించేది. ఈ రైల్వే స్టేషన్‌ను ఫిరోజ్‌పూర్ డివిజన్ నిర్వహిస్తుంది.


Also Read: Anchor Shyamala: యాంకర్ శ్యామలకు మాజీ సీఎం జగన్ బంపర్ ఆఫర్.. రాష్ట్రస్థాయిలో పదవి

2022లో ఈ విషయాన్ని అమృత్ మహోత్సవ్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది. భారత్‌లోనే ఉండే ఓ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టాలంటే భారతీయులకు వీసా ఉండాలని మీకు తెలుసా? అంటూ ట్వీట్ చేసింది. అమృత్‌సర్‌లోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టాలంటే భారతీయులకు కూడా కచ్చితంగా వీసా ఉండాలని పేర్కొంది. కాగా, ఈ పోస్టు కింద ఓ నెటిజన్ కీలక కామెంట్ చేశాడు. పాకిస్తాన్‌ వైపు కూడా ఇలాంటి రైల్వే స్టేషన్ ఉన్నదని పేర్కొన్నాడు.

Related News

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×