EPAPER

CID Notice to Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు సీఐడీ నోటీసులు!

CID Notice to Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు సీఐడీ నోటీసులు!

CID Issues Notice to BJP Senior Leader Yediyurappa: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. యడియూరప్పపై నమోదైన పోక్సో కేసు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న యడియూరప్ప.. అక్కడి నుంచి వచ్చిన తరువాత విచారణకు హాజరవుతారని మీడియాకు తెలిపినట్లు తెలుస్తోంది.


అయితే, సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు నుంచి యడియూరప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు వాటి సారాంశం. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారని, ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నదంటూ తెలిపారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు అయ్యిందని, ఆ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. అయితే, ఆయనపై ఆరోపణలు చేసిన మహిళ.. ఊపిరితిత్తుల క్యాన్యర్ కారణంగా ఇటీవల ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇదిలా ఉంటే.. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ ఇప్పటికే రికార్డు చేసింది.

Also Read: భారత్‌లోని పేదలు, వయనాడ్ ప్రజలు.. వీరే నా దేవుళ్లు: రాహుల్ గాంధీ


అయితే, తనపై వచ్చిన ఆరోపణలను యడియూరప్ప ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. తన కుమారుడు విజేయంద్ర కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. యడియూరప్ప నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Tags

Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×