EPAPER

China Disrupt India Elections : భారత ఎన్నికలపై చైనా కుట్ర కోణం.. కృత్రిమ మేథస్సుతో కుతంత్రాలు

China Disrupt India Elections : భారత ఎన్నికలపై చైనా కుట్ర కోణం.. కృత్రిమ మేథస్సుతో కుతంత్రాలు


China Disrupt India Elections : దేశమంతా ఎన్నికల హడావిడిలో ఉంటే భారత్ శత్రుదేశాలు మాత్రం కుట్రలు పన్నుతున్నాయి. భారత సార్వత్రిక ఎన్నికలను సర్వనాశనం చేసే దిశగా చైనా కృత్రిమ మేథస్సుకు పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ స్వయంగా వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. ఒక్క ఇండియానే కాదు, చైనా కుతంత్రంలో అమెరికా, సౌత్ కొరియా వంటి దేశాలు కూడా ఉన్నాయిని సమాచారం. అసలు, చైనా చేస్తున్న కుట్ర ఏంటీ..? దాన్ని ఎలా అమలు చేస్తోంది..? ఎందుకు చేస్తోంది..?

అవును, స్వయంగా మైక్రోసాఫ్ట్ అందించిన విశ్వసనీయ సమాచారం ఇది. ప్రపంచమంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో చైనా కుతంత్రాలు మరింత ఎక్కువవుతున్నాయనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ప్రపంచదేశాల్లో అశాంతిని రగిలించి చైనా వికృతానందం పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీని కోసం చైనా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృత్రిమ మేథస్సుతో రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగించి భారత్, అమెరికా, దక్షిణ కొరియాలో జరగనున్న ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు చైనా సిద్ధమవుతోందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. గతేడాది జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా ఈ కుట్రకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. తైవాన్ అధ్యక్ష ఫలితాలను ప్రభావితం చేయడానికి చైనా AIని ఉపయోగించిన తర్వాత మైక్రోసాఫ్ట్ నుండి ఈ హెచ్చరిక రావడం అంతర్జాతీయంగా ఆందోళనలు పెంచుతోంది.


Also Read : మోదీ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు: సోనియా గాంధీ

గత నెలలో, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు అభివృద్ధి గురించి ఇరువురూ చర్చించారు. మహిళల నేతృత్వంలో జరగాల్సిన అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, వ్యవసాయంలో సరికొత్త ఆవిష్కరణలు, వాతావరణ మార్పు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై బిల్ గేట్స్, మోడీలు చర్చించారు. ప్రపంచ స్థాయిలో సాంకేతికత, సుస్థిరత, సామాజిక పురోగతితో పాటు భారతదేశ డిజిటల్ పురోగతిపై ఇరువురు నేతలు ఫోకస్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. భారతదేశంలో డిజిటల్ విభజనను తగ్గించడానికి, అందరికీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం నిబద్ధతతో ఉందని అన్నారు. ఇక.. టెక్నాలజీలో ముఖ్యంగా AI ఆవిష్కరణలో భారతదేశం పురోగతిని బిల్ గేట్స్ ప్రశంసించారు. భారతదేశం సాంకేతికతలో ముందుకు వెళ్లడమే కాదు, వాస్తవానికి భారత్ టెక్నాలాజికల్‌గా మార్గనిర్దేశం చేస్తోందని ఆయన అన్నారు. సరిగ్గా, ఈ పరిణామం చైనాకు కంటగింపుగా మారింది. అలాగే, భారత్‌లో పెరుగుతున్న సాంకేతిక పురోగతి, అందరికీ అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటూ కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నాట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం.. యూరోపియన్ యూనియన్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా కనీసం 64 దేశాలు జాతీయ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ దేశాలు మొత్తం కలిస్తే… ప్రపంచ జనాభాలో దాదాపు 49 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే, ఈ సందర్భాన్ని చైనా అవకాశంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం ప్రకారం, ఉత్తర కొరియా ప్రమేయంతో పాటు చైనీస్ ప్రభుత్వ-మద్దతుగల సైబర్ గ్రూపులు కుంతంత్రాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో షెడ్యూల్ చేసిన పలు దేశాల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటూ చైనా గ్రూపులు ఈ కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ బృందం భావిస్తున్నారు. కుట్రలో భాగంగా.. దేశ ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి చైనా.. సోషల్ మీడియా ద్వారా AI- రూపొందించిన కంటెంట్‌ను ప్రచారం చేసే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఎన్నికల సమయంలో వారి ప్రయోజనాలకు అనుకూలంగా ఈ కంటెంట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారతదేశం, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్‌ లక్ష్యంగా చైనా ప్రస్తుతం పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

Also Read : లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా చైనీస్ హ్యాకర్స్.. మైక్రోసాఫ్ట్ సంచలన నివేదిక..

ఎన్నికల్లో గందరగోళం సృష్టించే దిశగా చైనా AIని వినియోగిస్తోంది. డీప్‌ ఫేక్‌లు, ఎప్పుడూ జరగని కల్పిత సంఘటనలను జరిగాయన్నట్లు చిత్రాలను క్రియేట్ చేయడంతో సహా మోసపూరిత, తప్పుడు కంటెంట్‌ను రూపొందించడానికి AI సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారంతో రాజకీయ ప్రకటనలను ప్రచారం చేస్తూ… ముప్పు కలిగించే ప్రయత్నం చేస్తోంది. అభ్యర్థుల ప్రకటనలు, వివిధ సమస్యలపై ప్రజల వైఖరి, కొన్ని సంఘటనల ప్రామాణికత గురించి ప్రజలను తప్పుదారి పట్టించడం.. వంటివి చైనా వ్యూహాల్లో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి చైనా ప్రయత్నాలను అడ్డుకోకపోతే.. నిజమైన సమాచారంతో నిర్ణయాలు తీసుకునే ఓటర్ల సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ బృందం హెచ్చరించింది.

అయితే, AIతో చైనా రూపొందిస్తున్న ఇలాంటి కంటెంట్ తక్షణ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, ఈ సాంకేతికతతో చైనా పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయోగాలు రానురానూ మరింత ప్రభావవంతంగా మారగలవని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఇటీవల, తైవాన్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా చేసిన గత ప్రయత్నాలను కూడా మైక్రోసాఫ్ట్ నివేదికల్లో ప్రస్తావించింది. AI- రూపొందించిన తప్పుడు సమాచారం తైవాన్ ఎన్నికల్లో వ్యాప్తి చెందిందని, విదేశీ ఎన్నికల్లో ఇటువంటి వ్యూహాలను ఉపయోగించిన చైనా ప్రభుత్వ-మద్దతు గల సంస్థ అప్పుడే మొదటిసారి గుర్తించబడినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. తైవాన్ ఎన్నికల సమయంలో.. స్టార్మ్ 1376 లేదా స్పామౌఫ్లేజ్ అని పిలిచే చైనా-మద్దతు ఉన్న సంస్థ ఇందులో చురుకుగా పనిచేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Also Read : బెంగాల్‌లో ఎన్‌ఐఏ బృందంపై ఇటుకలతో దాడి.. స్పందించిన దీదీ..

ఈ గుంపు నకిలీ ఆడియో ఎండార్స్‌మెంట్‌లు, మీమ్‌లతో సహా AI- రూపొందించిన కంటెంట్‌ను ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. నిర్దిష్ట అభ్యర్థులను కించపరచడం, ఓటరు అవగాహనలను ప్రభావితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, గతంలో AIతో రూపొందించిన టీవీ న్యూస్ యాంకర్‌లను ఉపయోగించడం అనేది ఇరాన్ కూడా ఉపయోగించిన వ్యూహంగా తెలుస్తోంది. ఇక, Storm-1376 అనే సంస్థ.. తైవాన్‌కు చెందిన అప్పటి-డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ-DPP ప్రెసిడెంట్ అభ్యర్థి విలియం లై పైనా.. ఇతర తైవాన్ అధికారుల పైనా.. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైనీస్ అసమ్మతివాదులకు సంబంధించిన AI మీమ్‌లు చాలానే ప్రచారం చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అలాగే.. స్టార్మ్-1376 అనే సంస్థ.. 2023 ఫిబ్రవరి నుండి టీవీ న్యూస్ యాంకర్‌లను కూడా రూపొందించిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

టిక్‌టాక్ యజమానికి చెందిన మరో చైనీస్ కంపెనీ.. బైట్‌డాన్స్ అభివృద్ధి చేసిన క్యాప్‌కట్ టూల్ ద్వారా న్యూస్ యాంకర్‌లను సృష్టించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే, ప్రముఖంగా, చైనా శత్రువులైన అమెరికా, భారత్‌ లక్ష్యంగా ప్రస్తుతం తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయడానికి పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది. గతంలో, చైనీస్ సమూహాలు USలో ప్రభావ ప్రచారాలను కొనసాగించడాన్ని కూడా మైక్రోసాఫ్ట్ తన నివేదికలో వెల్లడించింది. చైనా-మద్దతుగల కొందరు నటులు కూడా ఎన్నికల చర్చా వేదికలపై “విభజన ప్రశ్నలు” వేయడానికి, US ఓటర్లను విభజించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, దేశ సమస్యలను అర్థం చేసుకోవడానికి సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. వాటి ద్వారానే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తూ… ఓటర్లలో గందగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు కీలకమైన ఓటింగ్ డెమోగ్రాఫిక్స్‌పై నిఘా, ఖచ్చితత్వాన్ని సేకరించడానికి చైనా కృత్రిమ మేథస్సును ఉపయోగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ వివరాలన్నింటినీ మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్‌లో కూడా సాక్ష్యాలతో సహా పేర్కొంది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×