Chennai Crime : కొన్ని ఘటనలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. అసలు అలా ఎలా చేయగలిగారు..? అని ఆశ్చర్యమేస్తుంది. సాటి మనుషుల పట్ల అంత నిర్ధయగా ఎలా ప్రవర్తించగలిగారు అంటూ ఛీత్కరించుకునే ఓ ఘటనే చెన్నైలో వెలుగు చూసించి. 15 ఏళ్ల బాలికపై ఇంటి యజమానుల క్రూరత్వం.. కన్నీళ్లు పెట్టిస్తుంది.
తంజావూర్ జిల్లాకు చెందిన ఓ వితంతు మహిళ.. కుటుంబ పోషణ కష్టమై తన 15 ఏళ్ల కుమార్తెను చెన్నైలోని మెహత్ నగర్ లోని అమిన్జ్ కరాయ్ ప్రాంతంలోని మెహతా నగర్ లోని ఓ ఫ్లాట్లో పనికి కుదిర్చింది. ఎంతో ప్రేమగా కన్నా.. తిండి పెట్టలేని దుస్థితిలో కొన్నాళ్ల క్రితమే ఇంటి పనుల్లో చేర్పించింది. చిన్న పిల్ల నెమ్మదిగా పనులు నేర్చుకుంటుందిలే అనుకున్న ఆ తల్లికి.. చిన్నారి బాలిక శవమై తేలింది. నమ్మకంగా పనిలో పెట్టిన ఇంట్లోని బాత్రూమ్ లోనే విగత జీవిగా మారి.. ఆమెను శోకసంద్రంలో ముంచివేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకోగా.. వారికి ఉలిక్కిపడే దృశ్యాలు కనిపించాయి. ఆ చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలున్నాయి. వేడి ఇనుప వస్తువులు విచక్షణారహితంగా శరీరంపై ఎక్కడపడితే అక్కడ కాల్చిన గుర్తులున్నాయి. పైగా.. సిగరేట్ తోనూ బాలిక శరీరంపై కాల్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలికను అత్యంత తీవ్రంగా వేధించి, హింసించి చంపినట్లు గుర్తించి పోలీసులు.. ఇంటి యజమానులైన మహమ్మద్ నిషాద్, నసియాలను అదుపులోకి తీసుకున్నారు. బాలికను తామే చంపినట్లు అంగీకరించిన నిందితులు.. ఆమెపై ఎలా క్రూరంగా ప్రవర్తించారో కూడా వెల్లడించారు.
15 ఏళ్ల మైనర్ బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకోవడమే తప్పు.. పైగా ఆమెపై ఇలా మానవత్వం లేకుండా ప్రవర్తించి చంపేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అదీకాగ.. బాలిక చనిపోయిన తర్వాత, ఇంటి వెనుక బాత్రూమ్ లో బాలిక మృతదేహాన్ని పడేశారు ఈ నిందితులు. ఎవరీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా.. బంధువుల ఇంటికి పరారయ్యారు. ఆ తర్వాత.. వారి లాయర్ ద్వారా విషయం పోలీసులకు చేరడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ’10 రోజుల్లో సిఎం రాజీనామా చేయాలి లేకపోతే లేపేస్తాం’.. పోలీసులకు ఫోన్ చేసిన క్రిమినల్స్
బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్ మెడికల్ కాలేజీకి తరలించారు. వైద్యుల పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.