Big Stories

Cheetahs: చీతాలు ఎందుకు చనిపోతున్నాయ్? ఇదేనా కారణం?

pm modi cheetahs

Cheetahs: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ చీతాకు ఎదురుదెబ్బ తగులుతోంది. కునో నేషనల్‌ పార్క్‌లో ఇప్పటికే 3 చీతాలు, ఒక చిరుత పిల్ల మృతి చెందింది. తాజాగా మరో 2 చిరుత పులి పిల్లలు చనిపోయాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల 4 పిల్లలు జన్మించాయి. 4 పిల్లలో ఒకటి మంగళవారం మరణించగా.. గురువారం మరో 2 పిల్లలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

వీటి మరణంతో కునో నేషనల్‌ పార్క్‌లో 2 నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఐదుకు చేరింది. అధిక వేడి కారణంగానే చిరుతలు చనిపోతున్నట్లు పార్కు నిర్వహకులు చెబుతున్నారు. పుట్టినప్పటి నుంచి అవి బలహీనంగానే ఉన్నాయని అటవీశాఖ తెలిపింది.

- Advertisement -

ఇదిలా ఉండగా.. 1948లో చత్తీస్‌గఢ్‌ కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో చిరుతల ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. దీంతో వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 75 ఏళ్ల తర్వాత ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియాతో పాటు దక్షిణాఫ్రికా 20 చిరుతలను కునో నేషనల్‌ పార్క్‌కు కేంద్రం తరలించగా.. గతేడాది ప్రధాని తన పుట్టిన రోజున సందర్భంగా వాటిని ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు. ఇప్పటి వరకు సాషా, దక్ష అనే ఆడ చిరుతలతో పాటు ఉదయ్‌ అనే మగ చిరుత ఇటీవల మరణించాయి. జ్వాలాకు జన్మించిన నాలుగు పిల్లల్లో 3 మృతి చెందాయి. ప్రస్తుతం ప్రస్తుతం కునోలో 17 చిరుతలు, ఒక పిల్ల మిగిలింది.

అయితే, ఇక్కడి వాతావరణానికి ఆ చీతాలు ఇంకా అలవాటు పడలేదని.. అందుకే చనిపోతున్నాయని అంటున్నారు. మొదట్లో ఇలానే జరుగుతుందని.. ముందుముందు అంతా బాగానే ఉంటుందని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News