EPAPER

Chandipura Virus Danger Bells: డేంజర్‌గా మారిన చాందిపురా వైరస్.. ఆరుగురు మృతి..!

Chandipura Virus Danger Bells: డేంజర్‌గా మారిన చాందిపురా వైరస్.. ఆరుగురు మృతి..!

6 Died with Chandipura Virus in Gujarat and Rajasthan: దేశంలో సీజన్ మారడంతో రకరకాల వైరస్‌లు విజృంభిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇబ్బందులు తెస్తున్నాయి. వీటి బారినపడి చనిపోతున్న ఘటనలూ లేకపోలేదు. తాజాగా గుజరాత్‌లో చాందిపురా వైరస్ కలకలం రేపుతోంది. గడిచిన ఐదురోజుల్లో ఆరుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు.


చాందిపురా వైరస్ దాటికి ఒక్క గుజరాత్‌లో ఐదుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో మరో 12 మందికి సోకినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ విషయంలో నిర్లక్ష్యం వద్దని చెబుతున్నారు డాక్టర్లు. వైరస్ క్రమంలో విస్తరించి మెదడుకి చేరుతుందని అంటున్నారు. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు, వీక్‌నెస్ వంటివి ప్రధాన లక్షణాలుగా చెబుతున్నారు.

ఈ వైరస్ దోమలు, పేలు, ఇసుక ఈగల ద్వారా వ్యాపిస్తుంది. తొలిసారి ఇండియాలో 1965 ఏడాది మహారాష్ట్రలో కేసు నమోదైంది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది గుజరాత్‌లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఇండియాలోనే కాదు ఆసియా, ఆఫ్రికా లాంటి ఖండాల్లో ఈ వైరస్ ఉంది.


గుజరాత్‌లో వైద్య నిఫుణులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. హెల్త్ టీమ్‌లను గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, ఈగలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని సలహా ఇస్తున్నారు.

Also Read: బెంగుళూరులో ఆటోమెటిక్ పానీపూరి మెషిన్.. వాటర్ మాటేంటి?

గుజరాత్-రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యాధికారులు. ఉదయపూర్ జిల్లాలోని ఖేర్వారా, అఖివాడ గ్రామాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలకు చెందిన ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×