EPAPER

Chandipura virus in Gujarat: ముంచుకొస్తున్న మరో వైరస్.. గుజరాత్‌లో 16 మంది మృతి

Chandipura virus in Gujarat: ముంచుకొస్తున్న మరో వైరస్.. గుజరాత్‌లో 16 మంది మృతి

Chandipura virus in Gujarat Still 16 died: దేశంలో మరో వైరస్ ముంచుకొస్తుంది. గుజరాత్‌లో చాందీపురా వైరస్ కారణంతో 16 మంది మృతిచెందినట్లు ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. అలాగే మరో 50 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా చాందీపురా వైరస్ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోందన్నారు.


ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో చందీపురా వైరస్ అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ కేసులపై మరింత వివరణాత్మక దర్యాప్తు చేయాలని అధికారులు అన్నారు. ఇప్పటికే కేంద్ర బృందాన్ని రంగంలోకి దింపినట్లు చెప్పారు.

అయితే ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ బృందాలు మొత్తం 17,248 ఇళ్లల్లోని 1,21,826 మందిని పరీక్షించినట్లు తెలిపారు. గుజరాత్ తోపాటు రాజస్థాన్‌లో రెండు కేసులు, మధ్యప్రదేశ్‌లో ఒక్క కేసు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.


అంతకుముందు మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని చందీపూర్ గ్రామంలో ఒకరు చనిపోయారు. 1966లో 15 ఏళ్ల పిల్లలు చనిపోవడంతో వైద్యులు పరీక్షలు జరిపారు. అయితే వీరంతా వైరస్ కారణంగా చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఈ వైరస్‌కు చందీపూర్ వైరస్ గా నామకరణం చేశారు. ఆ తర్వాత 2004, 2006, 2019 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాల్లో గుర్తించారు.

ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో జ్వరం, విరేచనాలు ఉంటాయి. ఇది ఫ్లూ వంటి లక్షణాలతో పాటు తీవ్రమైన మెదడువాపు వ్యాధిని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ వైరస్ దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుందని, ఆర్ఎన్ఏ వైరస్ గా పేర్కొన్నారు. వ్యాధి నివారణలో భాగంగా మలాథియాన్ పౌడర్ ను పిచికారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×