EPAPER

new air ports, metro projects: కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. క్యాబినెట్ ఆమోదం

new air ports, metro projects: కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. క్యాబినెట్ ఆమోదం

Central Govt on Airports & metro projects(Telugu news live): పాట్నా, బెంగళూరు, థానే, పూణె నగరాలకు కేంద్రం వరాల జల్లును ప్రకటించింది. దాని ప్రకారం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా లో కొత్తగా సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. నూతన సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణానికి అయ్యే అంచనా ఖర్చు ఒక వెయ్యి నాలుగువందల పదమూడు కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణంతో పాట్నా ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల రద్దీని గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు.అయితే దీని నిర్మాణం అరవై ఆరు చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరగనుంది. ఒకేసారి మూడు వేల మంది ప్రయాణికులు ఈ ఎన్ క్లేవ్ ఉపయోగపడుతుంది. దీనితో పాట్నా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఈ వార్త తెలిసి పాట్నాలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ కష్టాలు గట్టెక్కనున్నాయని..కేంద్రానికి కృతజ్ణతలు తెలుపుకుంటున్నారు.


మెట్రో రైలు ప్రాజెక్టు

బెంగళూరు మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా మోక్షం లభించింది. రెండు ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటుకానున్నాయి. దీని ప్రకారం మొత్తం 31 మెట్రో స్టేషన్లు నిర్మాణం జరగనున్నాయి. అలాగే మహారాష్ట్ర లోని థానే, పూణె నగరాలకు సైతం పలు మెట్రో ప్రాజెక్టులు మంజూరయ్యాయి.


Related News

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Big Stories

×