EPAPER

Bihar Special Status: బీహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వలేం.. లోక్​సభలో కేంద్రం క్లారిటీ

Bihar Special Status: బీహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వలేం.. లోక్​సభలో కేంద్రం క్లారిటీ

Bihar Special Status: బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని లోక్‌సభలో కేంద్రం స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో భాగమైన జేడీయూ, బీహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బీహార్‌‌ ప్రత్యేక హోదాపై జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్టమెంట్ వేధికగా సోమవారం తెలిపారు.


ప్రత్యేక కేటగిరీ హోదాను గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు మంజూరు చేసింది. 1. కొండలు, పర్వత ప్రాంత భూభాగం, 2. తక్కువ జన సాంద్రత, జనాభాలో గిరిజనుల శాతం ఎక్కువగా ఉండటం, 3. అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉండటం, 4. ఆర్థిక, మౌళిక వసతులు లేని రాష్ట్రం,5. ఆర్థిక పరిస్థితి దిగజారిన రాష్ట్రం. ఈ విధంగా పేర్కొన్న అన్ని అంశాల సమగ్ర పరిశీలన ఆధారంగా ప్రత్యేక హోదా కోసం బీహార్ చేసిన అభ్యర్థనను ఇంటర్ మినిస్ట్రీరియల్ గ్రూప్ పరిశీలించింది. ఈ క్రమంలోనే తన నివేదికను 2012 మార్చి 30వ తేదీన కేంద్రానికి సమర్పించింది. ఇప్పటికే ఉన్న జాతీయ అభివృద్ధి మండలి ప్రమాణాల ఆధారంగా బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేం అని కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ ఛౌదరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉంటే అంతకు ముందు బీహార్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండింటిని ఇవ్వాలని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఆదివారం డిమాండ్ చేశారు. బీహార్, ఝూర్ఖండ్ విభజన జరిగినప్పటి నుంచి బిహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలని కోరుకుంటున్నామని అన్నారు. మరో వైపు పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ, బీజేడీ డిమాండ్ చేశాయి.


బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీహార్ కాంగ్రెస్ చీఫ్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మండిపడ్డారు. నితీష్ కుమార్ సీఎం అయినప్పటి నుంచి బీహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన లేవనెత్తుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కేటాయించేందుకు నిబంధనలు అనుమతించకుంటే వాటిని సవరించాలని అన్నారు. నితీష్ కుమార్ అధికారంలో ఉన్నా ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో నితీష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేయడం సరైనదేనని అఖిలేష్ సింగ్ సమర్థించారు. నితీష్ కుమార్ 2005లో సీఎం అయినప్పటి నుంచి తాము బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ వింటున్నామని గుర్తు చేశారు. ప్రతి సమావేశంలో ఈ డిమాండ్లు లేవనెత్తారని తెలిపారు.

Also Read: లైంగిక వేధింపుల కేసులో సూరజ్‌ రేవణ్ణకు బెయిల్‌ !

నితీష్ కుమార్ సీఎం పదవి చేపట్టి 20 ఏండ్లు పూర్తి చేసుకున్నారని, బిహార్ ప్రజలను మోసగించకుండా రాష్ట్రానికి సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్ ప్రత్యేక హోదాపై జేడీయూ ఎంపీ దినేష్ చంద్ర ఠాకూర్ కూడా స్పందించారు. ప్రత్యేక హోదా డిమాండ్ భవిష్యత్తులోనూ ముందుకు వస్తుందని, బీహార్‌కు పెట్టుబడులు ఎలా వస్తాయి. రాష్ట్రం ఎలా అభివృద్ధి సాధిస్తుందనే విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సి ఉందని ఆయన తెలిపారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×