EPAPER

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్..  జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Jamili elections: కేంద్ర కేబినెట్ సమావేశమయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్రమంత్రివర్గం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటు జమిలి ఎన్నికల విషయంలో కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చింది. అనంతరం జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


Also Read: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జమిలి ఎన్నికల నివేదికను మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నది.


ఇదిలా ఉంటే.. జమిలి ఎన్నికల విషయమై గత మంగళవారమే కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనా సమయంలోనే ఒకేసారి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలను నిర్వహిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్ కూడా జమిలి ఎన్నికలపై మాట్లాడుతూ.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్స్ ను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నది. ఇందుకు సంబంధించి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే తాము తప్పకుండా ఓడిస్తామంటూ స్పష్టం చేస్తోంది.

Also Read: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

కాగా, ఈ బిల్లు పార్లమెంటులో పాసైతే దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలనే జమిలి ఎన్నికలు అంటారు.

ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో కమిటీ వేసిన విషయం తెలిసిందే. 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఆ కమిటీ ఈ అంశంపై పూర్తిగా స్టడీ చేసింది. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఈ కమిటీ చర్చలు జరిపింది. ఇందుకు సంబంధించి అన్ని పార్టీల నుంచి వారి వారి అభిప్రాయాలను తీసుకుంది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఆ రాష్ట్రాల్లో ఎదురయ్యే సవాళ్లను కూడా కమిటీ పరిశీలించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన తరువాత రామ్ నాథ్ కోవింద్ కమిటీ కేంద్రానికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికకు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది.

జమిలి అంటే ఏమిటి..?

జమిలి ఎన్నికలంటే.. లోక్ సభ ఎన్నికలతోపాటు రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడాన్ని జమిలి ఎన్నికలంటారు. అయితే, ఇప్పటివరకు పార్లమెంటు ఎన్నికల ఎప్పుడూ జరిగినా ఆ సమయానికి కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ, ఓడిశా, సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలకు మాత్రం వేరు వేరు సమయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా కాకుండా దేశంలో ఓకేసారి లోక్‌సభ ఎన్నికలు, వీటితోపాటు అన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడమే ఈ జమిలి ఎన్నికల ఉద్దేశం.

Also Read: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పై ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను స్వీకరించి అమలు కోసం అడుగులు మొదలు పెట్టామంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ‘1951 నుంచి 1967 వరకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1999లో లా కమిషన్ 170 వ రిపోర్ట్ లో పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు, ఐదేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు అని నివేదిక ఇచ్చింది. 2017 పార్లమెంటరీ కమిటీ 79 వ నివేదికలో దేశంలో ఎన్నికలను రెండు దశలో నిర్వహించాలనే రికమెండ్ చేసింది.

రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికలో రెండు దశలలో దేశంలో ఎన్నికల నిర్వహించాలని పేర్కొన్నది. మొదటి దశలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరపాలని సూచించింది. వందరోజుల్లో రెండో దశలో లోకల్ బాడీ ఎలక్షన్స్.. మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అయితే, రెండు దశల్లో జరిగే ఎన్నికలకు ఒకే ఓట్ల జాబితా ఉండాలని ఆ నివేదికలో పేర్కొన్నది’ అంటూ కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related News

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×