Supreme court on Note for vote case(Telugu breaking news):
అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఓటుకు నోటు ఘటనను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేదు. 2015లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య నడిచిన వ్యవహారంలో రూ.50 లక్షల సూట్ కేసుతో రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు రేవంత్ రెడ్డి. దీని వెనుక ఉన్నది చంద్రబాబే అని అప్పటి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించడంతో రేవంత్, చంద్రబాబు పైనా కేసులు నమోదయ్యాయి. ఓటుకు నోటు అంశంపై రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం అయ్యారు. అయితే చాలా కాలంగా ఈ కేసు పెండింగ్ లోనే ఉంది.
పాకిస్తాన్ కు మార్చాలా?
చంద్రబాబు పాత్రపై హైకోర్టు స్టే విధించడంతో పిటిషన్ దారులు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. అయితే సోమవారం మరోసారి సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. రెండు వారాల పాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేసును హైదరాబాద్ పరిధినుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి విదితమే. సుప్రీం కోర్టు జడ్జి జగదీష్ రెడ్డి తరపున లాయర్లను ప్రశ్నిస్తూ అసలెందుకు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదలాయించాలని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన ముద్దాయి ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నందున అది ఆ కేసును ప్రభావితం చేస్తుందని కోరగా..అలా జరిగే అవకాశం ఉండదని..ఇలా అయితే పాకిస్తాన్ కు కేసులు షిఫ్ట్ చేయాలా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది ఏకమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలపై నడుస్తున్న ఓటుకు నోటు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.