EPAPER

Budget 2024: మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గుతాయా?.. కొత్త బడ్జెట్‌పై ఆశలు..

Budget 2024: మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గుతాయా?.. కొత్త బడ్జెట్‌పై ఆశలు..

Budget 2024: రేపు పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ పై దేశ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గించేందుకు కేంద్రం తీసుకునే చర్యల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటన చేయనున్నారా? అని ఎదురు చూస్తున్నారు. సీతారామన్ జూలై 23, 2024న పూర్తిస్థాయి ఆర్థిక బడ్జెట్ ని లోక్ సభలో సమర్పించనున్నారు.


గత సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతులపై కేంద్రం పన్నులు తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్ విడిభాగాలైన కెమెరా లెన్స్, ఇతర భాగాలు విదేశాల నుంచి దిగుమతులు చేసుకొని.. దేశీయంగా తయారు చేసే మొబైల్ ఫోన్స్ లో వాటిని ఉపయోగించడం మొదలుపెట్టరు.

బిజినెస్ పత్రిక ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. మొబైల్ ఫోన్స్, ఎలెక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియమ్ ఐయాన్ బ్యాటరీలపై కూడా ఆర్థిక మంత్రి పన్నులు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల కంపెనీలకు తయారీ ఖర్చు తగ్గుతుంది.


Also Read| Budget 2024: చిపరిశ్రమలకు బడ్జెట్ లో ఊరట లభించే అవకాశం.. కార్పోరేట్ల చెల్లింపులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపున్న 

పిఎల్ఐ పథకం మళ్లీ అమలు
వార్తా కథనం ప్రకారం.. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ 3.0 ప్రభుత్వం.. ఇంతకుముందు ప్రవేశ పెట్టిన ప్రాడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాన్ని తిరిగి అమలు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన రేపు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి చేయనున్నట్లు సమాచారం. దేశంలో మొబైల్ ఫోన్, ఎలెక్ట్రానిక్స్ తయారీ కంపనీలను ప్రోత్సహించడానికి పిఎల్ ఐ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ రంగంలో పెట్టుబడులు.. ఎగుమతులు చేయడానికి ప్రభుత్వం కంపనీలను పన్నులు తగ్గించడం లేదా తొలగించే యోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఉద్యోగ కల్పన, ఎగుమతులకు పిఎల్ఐ పథకంతో ఊతం
ఎలెక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ తయారీ రంగంలో దేశం అభివృద్ధి సాధించడంతో పాటు యువతకు ఉద్యగాలు కల్పించే కంపెనీలకు ప్రాడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేదోడునిస్తోంది. ఎలెక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, సహా 14 రంగాలకు వర్తించేలా కేంద్రం పిఎల్ఐ పథకాన్ని అమలు పరుస్తోంది. ఇప్పుడు మరిన్ని రంగాలకు ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని తెలిసింది.

Also Read: కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×