EPAPER

MLC Kavitha Bail Petition: వెనక్కు తగ్గిన కవిత.. బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

MLC Kavitha Bail Petition: వెనక్కు తగ్గిన కవిత.. బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

MLC Kavitha Bail Petition: ఢిల్లీ మద్యం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత ఉపసంహరించుకున్నారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ ..డిఫాల్ట్ బెయిల్‌కు అర్హురాలినని కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని వాదనల సందర్భంగా సీబీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు జులై 22వ తేదీన ప్రత్యేక కోర్టు ప్రకటించింది.


Also Read: మా స్థానంలో కూర్చోండి.. మాపై ఎంత ఒత్తిడి ఉందో తెలుస్తుంది: సుప్రీం సీజేఐ

ఈ నెల 9వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ ఛార్జిషీట్‌పై విచారణ జరపనుంది. చట్ట ప్రకారం తనకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కవిత దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదలనలు జరపాల్సి ఉండగా వాదలను వినిపించాల్సిన న్యాయవాదులు అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కోరారు. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేసిన రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి, పిటిషన్‌పై తుది విచారణ బుధవారం జరపనుంది.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×