MiG-29 Fighter Jet Crashes: జెట్ విమానం కూలే సమయం అది. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ పైలెట్లు కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు. చివరికి పూర్తిస్థాయిలో విమానం కూలిపోయే పరిస్థితికి రాగానే, ఒక్కసారిగా కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు ఆ పైలట్లు. ఈ ఘటన ఆగ్రాలో సమీపంలో చోటు చేసుకోగా, ప్రస్తుతం కేంద్రం ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.
పంజాబ్ అదంపూర్ నుండి ఆగ్రా కు వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ మిగ్ – 29 జెట్ విమానం ఆగ్రా సమీపంలో వద్దకు రాగానే విమానంలో సాంకేతిక లోపంకు తలెత్తినట్లు తెలుస్తోంది. దీనితో పైలట్లు ఏమీ చేయలేని స్థితిలో ఉండగా, విమానం కూలిపోయింది. అదే క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు విమానం నుండి ఇద్దరు పైలట్లు కిందికి దూకారు.
దీనితో ఇద్దరి పైలెట్లు సురక్షితులయ్యారు. విమానం నేల కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగగా, స్థానికులు హడావుడిగా ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అలాగే విమానం కూలిపోయిన సమయంలో భీకర శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్రం, అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తుకు ఆదేశించింది. విమానం నేల కూలినా, ఇద్దరు పైనట్లు సురక్షితం కావడంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.