EPAPER

Book My Chef : కోరిన చోటికి వస్తాం.. కమ్మని రుచులు అందిస్తాం

Book My Chef : కోరిన చోటికి వస్తాం.. కమ్మని రుచులు అందిస్తాం
Book My Chef

Book My Chef : ఏదైనా శుభకార్యం వేళ.. నాలుగైదు వందల మందికి వంట చేయాలంటే.. క్యాటరింగ్ ఇచ్చేయొచ్చు. కానీ.. 25 మందికి భోజనం చేయాలంటే ఎవరూ రారు. ముఖ్యంగా బర్త్ డే, ఫ్యామిలీ ఫంక్షన్స్‌ల్లో ఈ ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఇక ఎక్కడో వండి, ప్యాక్ చేసి, రవాణాచేసి, తీరా తినేసరికి వంటకం సహజ రుచి పోతుంది. ఈ సమస్యను గమనించి దీనికి పరిష్కారంగా పుట్టుకొచ్చిందే.. ‘బుక్ మై చెఫ్’ అనే హైదరాబాదీ స్టార్టప్. మీకు నచ్చిన వంటను వండిపెట్టే మనిషి మీ ఇంటికే వచ్చి, మీరు మెచ్చేలా మీ కంటిముందే వంటచేయటం వీరి ప్రత్యేకత.


ఇలా పుట్టింది..
లాక్‌డౌన్‌ తర్వాత కొడుకు బర్త్ డే రోజు క్యాటరింగ్‌కు ఎవరూ రాకపోయే సరికి.. హోటల్ రంగంలో ఉన్న శంకర్ కృష్ణమూర్తి తనకు తెలిసిన చెఫ్‌లను పిలిపించి అప్పటికప్పడు వేడివేడి వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేయించాడు. ఈ పద్ధతి వచ్చిన అతిథులందిరికీ నచ్చింది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రమోద్‌ జయవరపు, వరుణ్‌ రెడ్డిలు వ్యవస్థాపకులుగా నిలవటం, సహ వ్యవస్థాపకుడిగా శంకర్ కృష్ణమూర్తి కలిసిరావటంతో ‘బుక్‌మైచెఫ్‌’ ప్రయాణం మొదలైంది.

ప్రత్యేకతలు
హోటళ్ల రుచిని ఇంటిలో మీకు నచ్చిన మార్పులతో ఆస్వాదించాలనుకునే వారికి ఇదో చక్కని ప్రత్యామ్నాయం. అనుభవం ఉన్న వంట నిపుణులను ఒక వేదిక మీదికి చేర్చి, అవసరమైన చోట వారి సేవలను వినియోగించుకోవటం దీని ప్రత్యేకత. దేశ, విదేశీ ఆహార పదార్థాలు ఏవి కావాలన్నా మీ కిచెన్‌లో, మీ కంటిముందే చెఫ్‌లు అందిస్తారు. అందులో వాడే వాటి వివరాలూ మీరు తెలుసుకోవచ్చు.


ఛాయిస్ మీదే
కోరుకున్న వారు యాప్‌‌లో చెఫ్‌లను ఎంచుకోవచ్చు. ఇద్దరికైనా వండిపెట్టేందుకు చెఫ్ వచ్చేస్తాడు.
మెనూ, అతిథుల సంఖ్యను బట్టి ధర నిర్ణయం ఉంటుంది.
మినిమం మెనూ చార్జి తర్వాత అదనపు వంటకాలు కోరుకుంటే.. అది చేసే చెఫ్ చార్జ్ అదనం.
వంట దినుసులు తెమ్మంటే వారే వెంట తెచ్చుకుంటారు. కోరితే.. సర్వర్లు, క్లీనర్లనూ పంపుతారు.

విస్తరణ బాటలో..
సొంత పెట్టుబడితో మొదలైన సంస్థలో విక్రం రెడ్డి (యూవీ క్రియేషన్స్‌ ఫండ్‌), రోనిత్‌ రెడ్డి (గంగా కావేరీ వెంచర్స్‌) రూ. 2 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టారు.
ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా 40 మంది చెఫ్‌లు ఉన్నారు. ఈ ఏడాది చివరకు 400 మంది కాబోతున్నాం. ముంబయి, దిల్లీ, ఇతర నగరాలకూ విస్తరించబోతున్నాం.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×