EPAPER
Kirrak Couples Episode 1

Boycott Maldives | మాల్దీవులు వద్దు.. లక్షద్వీపే ముద్దు..!

Boycott Maldives | భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ.. చైనాకు దగ్గరవుతున్న మాల్దీవులకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా #boycottmaldives ట్రెండ్ సోషల్ మీడియాలో మారుమోగుతున్న వేళ.. పలువురు ప్రముఖులు తమ వ్యక్తిగత ఎక్స్ పేజీల్లో దీనికి మద్దతు పలుకుతున్నారు. ఈ సోషల్ మీడియా వార్.. తారస్థాయికి చేరటంతో గత రెండు రోజుల్లోనే మాల్దీవుల్లోని 8000 హోటల్ రూమ్‌లు, 2500కి పైగా విమాన టిక్కెట్లు రద్దయిపోయాయి.

Boycott Maldives | మాల్దీవులు వద్దు.. లక్షద్వీపే ముద్దు..!

Boycott Maldives | భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ.. చైనాకు దగ్గరవుతున్న మాల్దీవులకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా #boycottmaldives ట్రెండ్ సోషల్ మీడియాలో మారుమోగుతున్న వేళ.. పలువురు ప్రముఖులు తమ వ్యక్తిగత ఎక్స్ పేజీల్లో దీనికి మద్దతు పలుకుతున్నారు. ఈ సోషల్ మీడియా వార్.. తారస్థాయికి చేరటంతో గత రెండు రోజుల్లోనే మాల్దీవుల్లోని 8000 హోటల్ రూమ్‌లు, 2500కి పైగా విమాన టిక్కెట్లు రద్దయిపోయాయి.


భారత్‌కు మద్దతుగా ట్వీట్ చేసిన సెలెబ్రిటీల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉన్నారు. గత ఏప్రిల్‌లో తన 50వ బర్త్‌డేని అక్కడి సింధూదుర్గ్ ఐల్యాండ్‌లో సచిన్ టెండూల్కర్ సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ.. తాజాగా సచిన్ తన ఎక్స్ అకౌంట్‌లో ‘నిరుడు సింధూదుర్గ్‌లో ఆతిథ్యం బాగుంది. అది చాలా అందమైన జ్ఞాపకాలను అందించింది. కానీ.. మనదేశంలోనూ ఇలాంటి అందమైన ద్వీపాలుండడం మన అదృష్టం’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పోస్ట్‌లో చివర #ExploreIndianIslands అని హ్యాష్‌ట్యాగ్ పెట్టాడు. ఈ పోస్ట్‌ వైరల్ అవుతోంది.

మరికొందరు.. బాలీవుడ్ నటులు సైతం ఇదే బాట పట్టారు. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్‌లో స్పందించారు. ‘తమ దేశానికి అందరికంటే ఎక్కువ టూరిస్టులను పంపుతున్న భారత్ మీద మాల్దీవుల నేతల విద్వేషపు మాటలు విని ఆశ్చర్యంగా ఉంది. నేను చాలాసార్లు అక్కడికి వెళ్లాను. వారిని అభినందించాను కూడా. కానీ.. ఈ విషయంలో మన ఆత్మగౌరవాన్ని మనం వదులుకోకూడదు’ అని తన ఎక్స్ అకౌంట్‌లో స్పందించారు.


మరో నటుడు జాన్ అబ్రహం అతిథి దేవోభవ ఫిలాసఫీ గురించి చెబుతూ లక్షద్వీప్‌ని విజిట్ చేయాలని కోరాడు. కొన్ని లక్షద్వీప్‌ ఫొటోలను X వేదికగా షేర్ చేశాడు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ why not #ExploreIndianIslands అంటూ లక్షద్వీప్ ఫోటోలు షేర్ చేసింది.

ఇదే బాటలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా పోస్ట్ చేశాడు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యద్వీప్ ఐలాండ్స్‌లో సేద తీరడం చాలా కూల్‌గా ఉంది. అక్కడి బీచ్ ప్రదేశాలు చాలా క్లీన్‌గా ఉన్నాయి. ఇది మన ఇండియాలోనే ఉండడం ఆశ్చర్యంగా ఉంది.” అని ట్వీట్ చేశాడు.

వీరికి తోడుగా మాజీ ఇండియన్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా X లో పోస్ట్ పెట్టారు. ‘మనదేశాన్ని అంత ద్వేషించే మాల్దీవ్స్‌ని మనం ఎందుకు పట్టించుకోవాలి? మాల్దీవ్స్‌కి వెళ్లాలనుకునే భారతీయులూ.. కాస్త ఆలోచించండి’ అంటూ సూచించారు.

ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన, ఆ తర్వాత మాల్దీవులకు వ్యతిరేకంగా ట్రెండ్ అవుతోన్న యాష్ టాగ్ ప్రభావంతో.. నెటిజన్లు పెద్ద సంఖ్యలో గూగుల్‌లో మాల్దీవుల గురించి సెర్చి చేస్తున్నారు. కానీ.. ఈ పరిణామాలన్నీ మాల్దీవుల పాలకులకు మింగుడు పడటం లేదు. ‘బీచ్ టూరిజంలో మాతో ఎవరూ పోటీ పడలేరు’ అంటూ మాల్దీవుల మంత్రి తన ఎక్స్ పేజీలో గొప్పలు పోగా.. వెంటనే పెద్ద సంఖ్యలో నెటిజన్లు #boycottmaldives హ్యాష్‌ట్యాగ్‌ని ఆయన పోస్టుకి టాగ్ చేసి వరుస పెట్టి పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ఇలాంటి అందమైన వ్యూ మీ దేశంలో ఉందా’ అంటూ మరికొందరు ఆయనకు దీటుగా జవాబిచ్చారు.

Related News

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Big Stories

×