EPAPER

Hathras stampede: ఆ కుట్ర వల్లే హత్రాస్ తొక్కిసలాట.. భోలే బాబా లాయర్ సంచలన కామెంట్స్ !

Hathras stampede: ఆ కుట్ర వల్లే హత్రాస్ తొక్కిసలాట.. భోలే బాబా లాయర్ సంచలన కామెంట్స్ !

Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి భోలేబాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర పూరితంగానే హత్రాస్ తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. 15 మంది వ్యక్తులు విషం చల్లి తొక్కిసలాటను ప్రేరేపించారని అన్నారు.


ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో కుట్ర జరిగిందని భోలే బాబా తరపు న్యాయవాది ఆరోపించారు. సుమారు 15 మంది వ్యక్తులు విషం చల్లి తొక్కిసలాటను ప్రేరేపించారని అన్నారు. జూలై 2న బోలే బాబా సత్సంగం కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 123 మంది భక్తులు మరణించారు. అయితే ఈ తొక్కిసలాట జరగడానికి కొందురు కుట్రదారులు ప్లాన్ చేశారని ఏపీ సింగ్ ఆరోపించారు. హృదయ విదారకమైన సంఘటన జరిగింది. కుట్రలో 15 నుంచి 16 మంది పాల్గొన్నారని, గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన వాహనాలు కొన్నా తొక్కిసలాట జరగిన ప్రదేశంలో ఉన్నాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. అక్కడ ఉన్న భక్తులపై సుమారు 10 నుంచి 12 మంది భక్తులు విషం చిమ్మారని ఆరోపించారు.

అనంతరం అక్కడ ఉన్న మహిళలు పడిపోయారని తెలిపారు. ఊపిరి ఆడక చాలా మంది చనిపోయారని చెప్పారు. ఆ తర్వాత కుట్రదారులు అక్కడ నుంచి పారిపోయారని అన్నారు. సిట్, హత్రాస్ ఎస్పీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఘటన జరిగినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న వాహనాలను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.


మరో వైపు భోలే బాబాపై కేసు నమోదు రావడంపై న్యాయవాది ఏపీ సింగ్ స్పందించారు. తన క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదని తెలిపారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో సత్సంగ్ నిర్వహించిన భోలే బాబాకు రాజస్థాన్‌లోని అల్వార్‌లో కూడా ఓ ఆశ్రమం ఉంది. అక్కడ కూడా భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. అల్వార్‌లోని కేర్లి గ్రామానికి సమీపంలో భోలే బాబా ఆశ్రమం ఉంది. అక్కడికి భోలే బాబా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా బాబా అక్కడే ఉండేవారని ఆశ్రమ సేవకులు చెబుతున్నారు. భోలే బాబా నిర్వహించిన సత్సంగ్ లో సహజపూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే హత్రాస్ తొక్కిసలాట ఘటనపై తొలిసారి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ఈ ఘటనకు సత్సంగ్ నిర్వహించిన వ్యక్తే బాధ్యత వహించాలని భోలే బాబాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించిన వారికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. హత్రాస్‌ తొక్కిసలాట ఘటన తర్వాత భోలే బాబా పరారయ్యారు.. కానీ ఇప్పుడు ఆ విషాద ఘటనకు బాధపడ్డానని బాబా చెబుతున్నారు అది చాలా తప్పు, సత్సంగ్ నిర్వహించిన బాబానే తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించాలని సత్యేంద్ర దాస్ అన్నారు. అది అతడి బాధ్యత అని పేర్కొన్నారు. పోలీసుల ముందుకు వచ్చి తనే నేరాన్ని అంగీకరించాలని పేర్కొన్నారు.

Also Read: ఆ స్కీములన్నీ మూలకు పడేసేటివే: ఉద్ధవ్ థాక్రే

హత్రాస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడైన దేవి ప్రకాష్ మధుకర్‌ ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో అతడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కొంతమంది రాజకీయ నాయకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు నాయకులు రాంప్రకాష్, సంజు యాదవ్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు

Related News

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

×