Big Stories

BJP : బీజేపీకి షాక్.. పని చేయని మోదీ మ్యాజిక్, అమిత్ షా వ్యూహాలు..

- Advertisement -

BJP News Latest(Karnataka election results 2023): కర్ణాటక ఓటర్లు బీజేపీకి షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఎదురుగాలి వీచింది. కమలం వాడిపోయింది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం పని చేయలేదు. ప్రధాని మోదీ ప్రచారం మ్యాజిక్ చేయలేదు. మారధాన్ రోడ్ షోలు నిర్వహించినా ఓటర్లను ఆకర్షించలేకపోయారు. కాషాయ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కన్నడ ఓటర్లు బీజేపీ సర్కార్ ను దించేయాలనే సంకల్పించారు. ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

మోదీ, అమిత్ షా వ్యూహాలు కన్నడనాట బెడిసికొట్టాయి. సీనియర్లను పక్కన పెట్టడం పార్టీకి నష్టం కలిగించింది. జగదీశ్ శెట్టార్ లాంటి కీలక నేతలు ఎన్నికల ముందు పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం బీజేపీని దెబ్బకొట్టింది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో కొత్తవారికి ఎక్కువ టిక్కెట్లు ఇచ్చినా.. ఈ ఫార్ములా ఫెయిల్ అయ్యింది. బీజేపీ దాదాపు 80 స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నందిని పాల వివాదం బీజేపీకి తీవ్ర నష్టం కలిగించింది. ఈ వివాదాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఈ వివాదంతో రైతులు బీజేపీకి దూరమయ్యారు. ఇంటింటికి అర లీటర్ నందిని పాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా అప్పటికే బీజేపీకి తీవ్రనష్టం కలిగింది.

మత వివాదాలు బీజేపీపై న్యూట్రల్ ఓటర్లలో వ్యతిరేకతను పెంచాయి. భజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చడంతో ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇంటింటా హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలా హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు కాషాయ నేతలు చేసిన ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు. అందుకే ఓటమి తప్పటంలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News