EPAPER

BJP: ఇక బీజేపీకి వరుస దెబ్బలు.. ఏపీకి ముందుంది మంచి కాలం!

BJP: ఇక బీజేపీకి వరుస దెబ్బలు.. ఏపీకి ముందుంది మంచి కాలం!

BJP after Assembly Bypoll Results 2024 (political news today) : పార్లమెంట్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన బీజేపీకి నెల రోజుల్లోనే మరో షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో కమలం వాడిపోయింది. 13 స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం 2 స్థానాలకే పరిమితం అయింది. పైగా ఆ 13 సీట్లలో 5 స్థానాలు బీజేపీవే కావడం విశేషం. అంటే.. బీజేపీ మూడు స్థానాలు కోల్పోయింది. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు 10 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లో బీజేపీకి గట్టి దెబ్బ అనే చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ప్రయత్నించింది.


ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో.. ఎంపీ ఎన్నికలతోనే హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది. దానిలో నాలుగుకి నాలుగు స్థానాల కూడా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఇక.. ఇప్పుడు రెండు స్థానాలు జరిగితే.. ఈ రెండు స్థానాలను కూడా హస్తం పార్టీ సొంతం చేసుకుంది. అంటే.. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉంది.  ఇక్కడ రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండింటిని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అందులో ఒక్కటే కాంగ్రెస్ సిట్టింగ్ స్తానం. అంటే.. ప్రజలు బీజేపీని స్పష్టంగా తిరస్కరిస్తున్నారని అర్థం అవుతుంది.

ఈ ఉపఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ చాలా సుడిగుండాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాది చివరన మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. యూపీ తర్వాత అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో వచ్చే ఫలితాల ప్రభావం తర్వాత చాలానే పడుతుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మహరాష్ట్రలో బీజేపీని ఓ రకంగా ప్రజలు ఛీ కొట్టారనే చెప్పారు. శివసేన, ఎన్సీపీని చీల్చి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది.


అంతేకాదు.. నిజమైన శివసేన గుర్తును ఉద్ధవ్ ఠాక్రే చేతి నుంచి లాక్కొని షిండే చేతిలో పెట్టారు. ఇక నిజమైన ఎన్సీపీ గుర్తును శరద్ పవార్ నుంచి లాక్కొని అజిత్ పవార్ చేతిలో పెట్టారు. కోర్టులో షిండే, అజిత్ పవార్ గెలిచి ఉండొచ్చు కానీ.. ప్రజలు మాత్రమే ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ను ఆదరించారు. బీజేపీ చేసిన కుట్రలను తిప్పికొట్టారు. ఇప్పుడు మరో నాలుగు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. షిండే ప్రభుత్వంపై మహారాష్ట్ర ప్రజల్లో సానుకూలత లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో.. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు మరోసారి అధికారాన్ని సొంతం చేసుకునేందుకు గట్టిగానే రెడీ అవుతున్నాయి.

Also Read: సముద్రగర్భంలో రామసేతు వంతెన.. ఫొటోలు రిలీజ్ చేసిన ఇస్రో

అదే జరిగితే.. ఆ తర్వాత ప్రతీ ఏడాది కూడా రెండు, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ బీజేపీకి ఎదురుదెబ్బలు తప్పవు. మహరాష్ట్ర తర్వాత ఢిల్లీ, హర్యానా.. ఆ తర్వాత బీహార్‌లో ఉంటాయి. బీహార్ తర్వాత యూపీలో ఉంటాయి. మిగిలిన రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే.. బీజేపీకి మహారాష్ట్ర, బీహార్, యూపీ చాలా కీలకం. మహరాష్ట్రలో బీజేపీ అధికారాన్ని కోల్పోతే దాని ప్రభావం యూపీ, బీహార్ లో పడుతుంది. అయితే.. ఈ రాష్ట్రాల్లో ఓడిపోయినంత మాత్రానా కేంద్రంలో బీజేపీకి ఈ ఐదేళ్లు వచ్చిన నష్టం లేదు.

కానీ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు మోడీ టీం వెనకాడుతుంది. రాష్ట్రాల అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. ఇంతకు మందులా తిరుగులేదని అనుకునే దోరణి ఉండదు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మంచిదే అనే అభిప్రాయం ఉంది. ఓరకంగా చెప్పాలంటే.. మహారాష్ట్ర, బీహార్, యూపీలో బీజేపీకి దెబ్బపడితే.. ఏపీకి చాలా మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. కావాల్సిన నిధులు తెచ్చుకొని అమరావతి, పోలవరాన్ని పూర్తి చేయొచ్చని అనుకుంటున్నారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×