EPAPER

Suresh Gopi Denies Reports: అవన్నీ తప్పుడు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ గోపీ..

Suresh Gopi Denies Reports: అవన్నీ తప్పుడు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ గోపీ..

Suresh Gopi Denies Reports of Quitting Union Ministry: ప్రధాని మోదీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో భాగం కావడం తనకు ఇష్టం లేదని, తన మంత్రి పదవి నుంచి తప్పించుకోవాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలను త్రిస్సూర్ బీజేపీ ఎంపీ సురేష్ గోపీ ఖండించారు. సోషల్ మీడియా వేదికగా తను ఆ వార్తలను కొట్టిపారేశారు.


“మోదీ ప్రభుత్వ మంత్రిమండలికి నేను రాజీనామా చేయబోతున్నానని కొన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇది చాలా తప్పు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాము” అని సురేష్ గోపీ ట్వీట్ చేశారు.

ఆదివారం మోదీ 3.0 ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత, సురేష్ గోపి మంత్రి పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.


తనకు పదవి నుంచి విముక్తి పొందాలని.. త్రిస్సూర్ ప్రజల కోసం ఎంపీగా పనిచేయాలని.. అలాగే సినిమాలను ఒప్పుకున్నానని వాటిని ఎలాగైనా చేయవలసి ఉంటుందని సురేష్ గోపీ నివేదించినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి.

Also Read: 7th Pay Commission DA Hike News: ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో డీఏ పెంపు..!

‘‘ఎంపీగా పనిచేయడమే నా లక్ష్యం.. నేనేమీ అడగలేదు.. నాకు ఈ పదవి అవసరం లేదని చెప్పాను.. త్వరలోనే ఆ పదవి నుంచి రిలీవ్ అవుతానని అనుకుంటున్నా.. త్రిసూర్ ఓటర్లతో ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి తెలుసు, ఎంపీగా నేను వారి కోసం ఎంతైనా మంచి ప్రదర్శన ఇస్తాను, నేను నా సినిమాలను ఎలాగైనా తీయాలి” అని ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఢిల్లీలో ఒక ప్రాంతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ సురేష్ గోపి అన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

 

 

అయితే, గోపీ ఆఫీస్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. సురేష్ గోపీ ఈ విధంగా చెప్పలేదని.. వాస్తవానికి, మీడియాలోని ఒక నిర్దిష్ట వర్గం ద్వారా అపోహలు వ్యాప్తి చెందుతాయని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో కేటాయింపు తర్వాత సురేశ్ గోపీ స్పష్టత ఇస్తారని తెలిపింది.

Also Read: మోదీ కేబినెట్ భేటీ, శాఖల కేటాయింపు.. కీలక సూచనలు

గోపీ, బీజేపీ సీనియర్ నాయకుడు జార్జ్ కురియన్, కేరళ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాందించారు. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న త్రిసూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సురేష్ గోపీ విజయం సాధించి కేరళ నుంచి తొలి బీజేపీ ఎంపీగా చరిత్ర సృష్టించారు. త్రిముఖ పోరులో సీపీఐ అభ్యర్థి వీఎస్ సునీల్ కుమార్‌పై సురేశ్ గోపీ 74 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి కే మురళీధరన్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×