EPAPER

Income from EB Scheme to BJP: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ₹1300 కోట్లు.. కాంగ్రెస్ కన్నా ఏడు రెట్లు ఎక్కువ!

Income from EB Scheme to BJP: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ₹1300 కోట్లు.. కాంగ్రెస్ కన్నా ఏడు రెట్లు ఎక్కువ!
BJP Income Through Electoral Bonds Scheme

Electoral Bonds Scheme income to BJP: అధికార భారతీయ జనతా పార్టీ(BJP) 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దాదాపు ₹1300 కోట్లు పొందింది. కాంగ్రెస్ అదే మార్గంలో పొందిన దాని కంటే ఏడు రెట్లు ఎక్కువ.


2022-23 ఆర్థిక సంవత్సరంలో BJP మొత్తం విరాళాలు ₹2120 కోట్లుగా ఉన్నాయి. వీటిలో 61 శాతం ఎలక్టోరల్ బాండ్ల నుండి వచ్చినవే అని పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిలో పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీ మొత్తం విరాళాలు ₹ 1775 కోట్లు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీ ఆదాయం ₹1917 కోట్లగా ఉండగా.. 2022-23లో పార్టీ మొత్తం ఆదాయం ₹2360.8 కోట్లకు పెరిగింది.


2021-22 ఆర్థిక సంవత్సరంలో ₹236 కోట్లగా ఉన్న కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్ల విలువ.. 2022-23లో ₹171 కోట్లకు తగ్గింది.

Read More: 17వ లోక్ సభ.. మోదీ చివరి స్పీచ్..

బీజేపీ, కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇక రాష్ట్ర పార్టీ విషయాలకొస్తే.. సమాజ్ వాదీ పార్టీ, 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹3.2 కోట్లు సంపాదించింది. 2022-23లో, ఈ బాండ్ల నుండి దీనికి ఎటువంటి విరాళాలు రాలేదు.

మరో రాష్ట్ర పార్టీ టీడీపీ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹34 కోట్లు సంపాదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10 రెట్లు పెరిగింది.

బీజేపీ కేవలం వడ్డీల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ₹237 కోట్లు సంపాదించింది. 2021-22లో ఇది ₹135 కోట్లుగా ఉంది.

బీజేపీ మొత్తం వ్యయంలో, ఎన్నికల ప్రచారం, సాధారణ ప్రచారంపై విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి BJP ₹78.2 కోట్లు చెల్లించింది, ఇది 2021-22లో ₹117.4 కోట్లుగా ఉంది.

2022-23లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా ₹76.5 కోట్లు చెల్లించింది. 2021-22లో ఇది ₹ 146.4 కోట్లుగా నమోదయ్యింది. ‘మొత్తం చెల్లింపులు’ శీర్షిక కింద పార్టీ ఈ సహాయాన్ని చూపింది.

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×