EPAPER

BJP MLA shoots Shiv Sena Leader | శివసేన నాయకులపై కాల్పులు జరిపిన బిజేపీ ఎమ్మేల్యే.. పోలీసుల ఎదుటే ఘటన!

BJP MLA shoots Shiv Sena Leader | మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, బిజేపీ కూటమి పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. ఈ ఘటన పోలీసుల ఎదుటే జరగడంతో సంచలనంగా మారింది.

BJP MLA shoots Shiv Sena Leader | శివసేన నాయకులపై కాల్పులు జరిపిన బిజేపీ ఎమ్మేల్యే.. పోలీసుల ఎదుటే ఘటన!

BJP MLA shoots Shiv Sena Leader | మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, బిజేపీ కూటమి పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. ఈ ఘటన పోలీసుల ఎదుటే జరగడంతో సంచలనంగా మారింది.


శివసేన నాయకుడు, నగర మేయర్ మహేష్ గైక్వాడ్, బిజేపీ ఎమ్మెల్యే గణ్‌‌పథ్ గైక్వాడ్ మధ్య చాలా కాలంగా భూవివాదం జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఫిబ్రవరి 2,2024న రాత్రి 10 గంటలకు ఇరు పార్టీలు ముంబైలోని ఉల్హాస్ నగర్ హిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ కూడా మహేష్ గైక్వాడ్‌కు తోడుగా వెళ్లారు.

పోలీసుల ఎదుటు వివాదాన్ని పరిష్కారం గురించి మాట్లాడుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గొడవ పెద్దదై బిజేపీ ఎమ్మెల్యే గణ్‌‌పథ్ గైక్వాడ్ కోపంతో తన వద్ద తుపాకీ అయిదు బుల్లెట్లు కాల్చాడు. ఈ ఘటనలో శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్, శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ గాయపడ్డారు. ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు.


మహేష్ గైక్వాడ్ పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్‌కి స్వల్ప గాయాల కావడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. మరోవైపు బిజేపీ ఎమ్మెల్యేతొపాటు, ఆయన అనుచరులిద్దరిని పోలీసులు అరెస్టు చేసి.. కాల్పులు జరిపిన తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో భూమి యజమాన్య హక్కుల విషయంలో బిజేపీ ఎమ్మెల్యే గణ్‌పథ్ గైక్వాడ్, స్థానికల మధ్య గత కొంత కాలంగా గొడవ జరుగుతోంది. అయితే తమకు న్యాయం చేయమని స్థానికులు నగర మేయర్ శివసేన నాయకుడు మహేహ్ గైక్వాడ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 31న బిజేపీ ఎమ్మెల్యే, శివసేన నగర మేయర్ అనుచరుల మధ్య గొడవలు జరిగాయి.

సమస్య పరిష్కారం కోసం బిజేపీ ఎమ్మెల్యే తన కొడుకుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు పిలవడంతో మేయర్ మహేష్ గైక్వాడ్ కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఇన్స్‌పెక్టర్ కేబిన్‌లో మాట మట పెరిగి.. బిజేపీ ఎమ్మెల్యే తన వద్ద ఉన్న తుపాకీ తీసి కాల్పులు జరిపారు.

ఈ కేసులో నిందితుడైన బిజేపీ ఎమ్మెల్యే అయిన గణ్‌పథ్ గైక్వాడ్ మూడు సార్లు కల్యాణ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండుసార్లు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎన్నికలు గెలిచారు. గత ఎన్నికల్లో బిజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మరోవైపు మహేష్ గైక్వాడ్.. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకి సన్నిహితుడు. ఆయన కల్యాణ్ ఈస్ట్ నియోజకవర్గానికి మేయర్.

ఈ ఘటన తరువాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన నాయకులు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని.. అధికార పార్టీ నాయకులే చట్టాన్ని గౌరవించడం లేదని చరుకలంటించారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, హోమ్ మంత్రి దేవేంద్ర ఫడ్ నవీస్ బాధ్యతలు వహించాలని అన్నారు.

మరోవైపు డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ఈ ఘటనపై స్పందించారు. ప్రజాప్రతినిధులు శాంతిభద్రతలు కాపాడాలని.. అధికార దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని అన్నారు.

Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×