EPAPER

BJP Son Marry Pak Girl: రాజకీయాలను జయించిన ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన బిజేపీ నాయకుడి కుమారుడు..

BJP Son Marry Pak Girl: రాజకీయాలను జయించిన ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన బిజేపీ నాయకుడి కుమారుడు..

BJP Son Marry Pak Girl| ఇండియా, పాకిస్తాన్.. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడూ శత్రుత్వమే ప్రధాన బంధంగా ఉంటుంది. కానీ అరుదుగా రెండు దేశాల ప్రజలు ఒకరినొకరు ఇష్టపడిన సందర్భాలున్నాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ అఖ్తర్ ను ప్రేమించింది. ఇలాంటి సెలెబ్రిటీ ఉదాహరణలు ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కానీ తాజాగా ఒక రాజకీయ నాయకుడి కుమారుడు.. అది కూడా పాకిస్తాన్ పై ఎప్పుడూ నిప్పులు చెరిగే భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడి కుమారుడు పాకిస్తాన్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఇరు వైపుల నుంచి వందల సంఖ్యలో అతిథులు హాజరు కావడం విశేషం. ఈ ఘటన శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పూర్ జిల్లాకు చెందిన ఒక బిజేపీ కార్పొరేటర్ కుమారుడు.. పాకిస్తాన్ లో నివసిస్తున్న తన దూరపు బంధువుల కుటుంబానికి చెందిన యువతిని శుక్రవారం అక్టోబర్ 19, 2024న పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహం ఆన్ లైన్ లో జరగడం విశేషం. అంటే పెళ్లికూతురు పాకిస్తాన్ లో ఉండగా.. పెళ్లికొడుకు ఇండియాలోనే ఉన్నాడు. ఇద్దరూ ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం.. ఆన్ లైన్ లో తమ అంగీకారం తెలిపి వివాహ ప్రక్రియను పూర్తిచేశారు.

వివరాల్లోకి వెళితే.. జౌన్ పూర్ జిల్లాకు చెందిన బిజేపీ కార్పొరేటర్ తెహ్‌సీన్ షాహిద్ కుమారుడు మెహమ్మద్ అబ్బాస్ హైదర్ పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో నివసిస్తున్న అన బంధువుల అమ్మాయి అందలీప్ జహ్రాను ప్రేమించాడు. ఈ విషయం కార్పొరేటర్ షాహిద్ కు తెలియడంతో ఆయన వారిద్దరికీ వివాహం చేయాలని నిశ్చయించాడు. అటు పాకిస్తాన్ లో తన బంధువులు కూడా ఈ పెళ్లికి అంగీకారం తెలిపారు. అయితే ఇదంతా ఒక ఏడాది క్రితం జరిగింది.


Also Read: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి

ఇరు వర్గాలు పెళ్లి సంబంధానికి సుముఖంగా ఉండడంతో వరుడి కుటుంబమంతా పాకిస్తాన్ కు వెళ్లి వివాహం జరిపించాలనుకుంది. అందుకోసం సంవత్సరం క్రితమే వీసా కోసం దరఖాస్తు చేసినా.. వీసా ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. అలా ఏడాది గడిచినా వీసా లభించలేదు. అయితే రెండు నెలల క్రితం పెళ్లికూతరు తల్లి యాస్మీన్ జైదీకి తీవ్ర అనారోగ్యం చేసింది. దీంతో ఆమె తాను బతికుండగానే తన కూతురి పెళ్లి కళ్లారా చూడాలనుకుంది. ఆమె కోరిక తీర్చడానికి పాకిస్తాన్ వీసా కోసం నెలరోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

ఇక చివరికి పెళ్లి ఆన్ లైన్ లో చేయడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. దీని కోసం ఆన్ లైన్ వీడియో కాలింగ్ మోడ్ లో పెళ్లి చేయాలని నిశ్చయించారు. శుక్రవారం ఈ పెళ్లి జరిపించడానికి ఇరు వైపులా మౌలానాలు విచ్చేసి పెళ్లి కార్యక్రమం పూర్తిచేశారు. జౌన్ పూర్ నగరంలోని షియా ముస్లింల ఇమామ్ బాడా వద్ద ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి చూసేందుకు వందలాది అతిథులు విచ్చేశారు. అందరూ పెళ్లి లైవ్ లో చూడడానికి పెద్ద టీవి స్కీన్ ఏర్పాటు చేశారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం నికాహ్ ప్రక్రియలో వధూవరులు పెళ్లికి తమ అంగీకారం వీడియో కాలింగ్ ద్వారా తెలియజేశారు.

BJP son marry Pak Girl

అలా నికాహ్ పూర్తి అయిన తరువాత అతిథులందరికీ భారీగా విందు భోజనం ఏర్పాట్లు చేశారు. పెళ్లి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజేపీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్ ప్రీషు వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు. పెళ్లి ముగించిన తరువాత పెళ్లి చేయించిన మౌలానా మహఫజూల్ హసన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి ఇలాంటి వివాహాలు ఇంకా జరగాలని అన్నారు. ఇరు దేశాల రాజకీయ నాయకులు చర్చల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గం అన్వేషించాలన్నారు.

చివరగా మీడియాతో పెళ్లికొడుకు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా వీసా కోసం ఎదురు చూస్తున్నా.. అధికారులు ఆలస్యం చేస్తూనే ఉన్నారని.. ఇరు దేశాల ప్రజల మధ్య శత్రుత్వం లేదని.. తన భార్యను కలుసుకోవడానికి త్వరగా వీసా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

Related News

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Jharkhand Bjp : ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

Navya Haridas BJP : ప్రియాంక గాంధీపై పోటీకి సై అంటున్న న‌వ్య హ‌రిదాస్‌, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న వయనాడ్, నీదా నాదా అంటున్న కాంగ్రెస్, బీజేపీ

Kashmir Marathon: 2 గంటల్లో 21 కిమీ పరుగెత్తిన ముఖ్యమంత్రి.. ‘ట్రైనింగ్ లేకుండానే సాధించాను’

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీ కొట్టిన బస్సు-12 మంది మృతి

Railway fines Police: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే పోలీసులు.. అడిగితే అధికారులకు బెదిరింపులు

Delhi Bomb Blast: ఢిల్లీలో బాంబు పేలుడు.. సిఆర్‌పిఎఫ్ స్కూల్ వద్ద ఘటన!

Big Stories

×