EPAPER

CM Buddhadeb no more: మాజీ సీఎం బుద్దదేవ్ ఇక లేరు

CM Buddhadeb no more: మాజీ సీఎం బుద్దదేవ్ ఇక లేరు

Buddhadeb bhattacharya death news(Today news paper telugu): వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. గురువారం ఉదయం కోల్‌కతాలో తన నివాసంలో మరణించారు. ఆయనకు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు.


కొన్నాళ్లుగా బుద్దదేవ్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల 20 నిమిషా లకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. దక్షిణ కోల్‌కత్తాలోని బల్లిగంజ్ ప్రాంతంలో ఆయన ఉంటున్నారు.

బుద్దదేవ్ భట్టాచార్య 2000-2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సమయంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బెంగాల్‌కు చివరి మార్క్సిస్ట్ ముఖ్యమంత్రి భట్టాచార్య. ఆయన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.


ALSO READ:  ముక్కలైన కాళీ బ్రిడ్జి.. అసలేం జరిగింది?

జ్యోతిబసు తర్వాత బెంగాల్‌ను పారిశ్రామికీకరణ వైపు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారాయన. 2001లో భట్టాచార్య అధికారంలోకి రాగానే హుగ్లీలోని సింగూర్‌లో ఆటోమొబైల్ ఫ్యాక్టరీని నిర్మించడానికి టాటా మోటార్స్‌ను ఒప్పించారు. సింగూర్-నందిగ్రామ్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో భూసేకరణకు వ్యతిరేక ఉద్యమాలు చేపట్టారు.

కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీ పూర్వ విద్యార్థి బుద్ధదేవ్. ఆ తర్వాత టీచర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1977లో తొలిసారి కాశిపుర్-బెల్గాచియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ఆ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. జ్యోతిబసు హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు కూడా. 2001, 2006ల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×