EPAPER

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Bank Holidays in october 2024: అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అందుకు బ్యాంకు ఖాతాదారులు కొన్ని ముఖ్యమైన పనులను ముందస్తుగా చేసుకుంటే మంచిదని పలువురు చెబుతున్నారు. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావున బ్యాంకు సెలవులను దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు ప్లాన్ చేసుకోవడం మంచిది.


అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్, ధన్ తేరాస్, దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. ఇలా వచ్చే నెలలో పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు , ఆదివారాల్లో కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.

అయితే, మరికొన్ని రోజుల్లో సెప్టెంబర్ పూర్తికానుంది. ఈనెల పూర్తయి అక్టోబర్ రానుంది. ప్రతీ నెల మాదిరిగా అక్టోబర్‌లోనూ సెలవులు ఉంటాయి. అయితే దాదాపు సగం రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అందుకే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అక్టోబర్ నెలకు సంబంధించి సెలవుల లిస్టును ప్రకటించింది.


ఖాతాదారులకు బ్యాంకు పని ఉన్నట్లయితే త్వరగా చేసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం చాలామంది ఆన్ లైన్ ద్వారానే సేవలు పొందుతున్నారు. కానీ క్రెడిట్, డెబిట్, లోన్స్ ఇలా తప్పనిసరిగా బ్యాంక్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా సెలవుల జాబితాను తెలుసుకోవాలి. అక్టోబర్ లో సెలవుల జాబితాను పరిశీలిస్తే.. ఏకంగా 12 రోజులు బంద్ ఉంటుంది.

Also Read: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

సెలవులు జాబితా

అక్టోబర్‌ 2న గాంధీ జయంతి
అక్టోబర్‌ 3న నవరాత్రి వేడుకలు ప్రారంభం. మహారాజా అగ్రసేన్‌ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 6న ఆదివారం బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 10 మహా సప్తమి సందర్భంగా బ్యాంకులకు హాలీడే.
అక్టోబర్‌ 11న మహానవమి సందర్భంగా మూసివేత.
అక్టోబర్‌ 12న దసరా, రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.
అక్టోబర్‌ 13న ఆదివారం కావడంతో సెలవు.
అక్టోబర్‌ 17న కటి బిహు (అసోం), వాల్మీకి జయంతి కారణంగా బ్యాంకులకు హాలీడే.
అక్టోబర్‌ 20న ఆదివారం సెలవు.
అక్టోబర్ 26న విలీన దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో, నాల్గో శనివారం కారణంగా హాలీడే.
అక్టోబర్‌ 27న ఆదివారం సెలవు.
అక్టోబర్ 31న దీపావళి, సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ సందర్భంగా సెలవు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×