EPAPER

Bengaluru Rave Party Updates : బెంగళూరు రేవ్ పార్టీలో వెలుగులోకి సంచలన విషయాలు.. వ్యభిచారం జరిగిందా ?

Bengaluru Rave Party Updates : బెంగళూరు రేవ్ పార్టీలో వెలుగులోకి సంచలన విషయాలు.. వ్యభిచారం జరిగిందా ?

Prostitution in Bengaluru Rave Party : బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు వాసు, అరుణ్, సిద్ధిఖీ, రన్ ధీర్, రాజ్ భవ్ లను అరెస్ట్ చేశారు. వాసు బర్త్ డే పార్టీ పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు నిర్థారించారు సిద్ధిఖీ, రన్ ధీర్, రాజ్ భవ్ లను డ్రగ్స్ పెడ్లర్లుగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పార్టీ నిర్వాహకుడైన వాసు .. బెజవాడలోని చిట్టినగర్ కు చెందినవాడుగా గుర్తించారు పోలీసులు. అయితే తాజాగా.. ఈ పార్టీలో వ్యభిచారం కూడా జరిగి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ జరిగిన జీఆర్ ఫాంహౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు.


ఈ రేవ్ పార్టీలో మొత్తం 200 మంది పాల్గొనగా.. ఎంట్రీ ఫీజు రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువమంది వెళ్లినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడటంతో.. విచ్చలవిడిగా వ్యభిచారం కూడా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీకి క్రికెట్ బుకీలు, సినీ ఇండస్ట్రీకి చెందినవారు, రాజకీయ నేతలు హాజరయ్యారు. అరెస్ట్ చేసిన ఐదుగురి బ్లడ్ శాంపిల్స్ ను ఇచ్చినట్లు సమాచారం. పార్టీ నిర్వాహకుడైన వాసు నేర చరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసును బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు.

Also Read : ‘నన్నుపేకాట ఆడానని చెప్పింది’.. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ ఏం చేసింది.. దులిపేసిన కరాటే కళ్యాణి!


బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో సినీ నటులే కాదు.. టీవీ నటులు, మోడల్స్ కూడా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా నటి హేమ విషయం వైరల్ అయింది. తాను అక్కడ లేనంటూ ఆమె వీడియో విడుదల చేసిన తర్వాత.. పోలీసులు అదే స్పాట్ నుంచి ఫొటో రిలీజ్ చేశారు. దీంతో హేమ దమ్ బిర్యానీ చేస్తూ మరో వీడియో చేసింది. కానీ.. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో 1 గంటలో రావొచ్చన్న విషయం అందరికీ తెలుసని మరిచిపోయినట్టుందని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఈ పార్టీలో జానీ మాస్టర్, శ్రీకాంత్ లు కూడా ఉన్నారని వార్తలు రాగా.. ఆ వార్తల్ని వారిద్దరూ ఖండించిన విషయం తెలిసిందే.

 

 

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×