EPAPER

Ayodhya Donations : 14 ఏళ్ల బాలిక ఉడతా భక్తి.. రామమందిరం నిర్మాణం కోసం రూ.52 లక్షల విరాళం..

Ayodhya Donations : 14 ఏళ్ల బాలిక ఉడతా భక్తి.. రామమందిరం నిర్మాణం కోసం రూ.52 లక్షల విరాళం..
Telugu news live today

Ayodhya Donations(Telugu news live today) :

అయోధ్య రామయ్యకు దేశ నలుమూలల నుంచి భక్తులు కానుకలు పంపిస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం చాలా మంది విరాళాల అందిస్తున్నారు. సీతారాముల వారి మీద భక్తి తో ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ.52 లక్షల విరాళాలను సేకరించి ఇచ్చింది.చిన్న వయసులో అంత నగదును సేకరించి ఇచ్చిన బాలికపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.


గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భవికా మహేశ్వరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని.. దాని కోసం ప్రజలు తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారని తెలుసుకుంది. తానూ కూడా ఆలయానికి విరాళం అందించాలని నిర్ణయించుకుంది.రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. బహిరంగ సభల్లో ఆ కథలను ప్రజలకు చెప్పింది. 2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రామమందిర నిర్మాణాం కోసం రూ.లక్ష విరాళం ఇచ్చారు.అలా భవికా తాను 11 ఏళ్ల వయసు నాటి నుంచి 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి 300 పైగా ప్రదర్శనలు చేసింది. ఆ వింధంగా రూ.52 లక్షల వరకు సేకరించింది. నగదు మొత్తన్ని అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది.

భవికా రాముడి కథలను ప్రదర్శించడమే కాకుండా 108పైగా వీడియోలను రికార్డ్​ చేసి యూట్యూబ్​లో అప్​లోడ్ చేసింది .ఆ వీడియోలను దాదాపు లక్ష మంది వీక్షించారు. అంతేకాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఒక పుస్తకాన్ని కూడా రాసింది.


శ్రీరాముడికి సహాయం చేయడానికి ఉడత ముందుకు వచ్చినట్లే, నేను కూడా రామ మందిర నిర్మాణం కోసం నా వంతు సహాయం చేశాను అని భవికా తెలిపింది. నేను ఇలా చేయడానికి నా తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొందాను. చిన్నప్పటి నుంచి రామాయణం చదివాను. ఎన్నో తరాల వారు రామ మందిరాన్ని చూడలేకపోయారు. రామమందిరం మా తరంలో రూపుదిద్దుకోవడం మా అదృష్టం.” అని
భవికా వివరించింది

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×