EPAPER

Arvind Kejriwal Bail : సుప్రీం కోర్టు బెయిల్ మంజూర్ చేసినా.. జైలులోనే కేజ్రీవాల్.. ఎందుకంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనను చట్టవ్యతిరేకంగా అరెస్టు చేసిందని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసుని విచారణని చేసిన సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ.. ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ పై కేజ్రీవాల్ ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Arvind Kejriwal Bail : సుప్రీం కోర్టు బెయిల్ మంజూర్ చేసినా.. జైలులోనే కేజ్రీవాల్.. ఎందుకంటే?

Arvind Kejriwal Bail| ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనను చట్టవ్యతిరేకంగా అరెస్టు చేసిందని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసుని విచారణని చేసిన సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ.. ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ పై కేజ్రీవాల్ ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


బెయిల్ ఆదేశాలు జారీ చేస్తూ.. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కేసులోని కొన్ని ముఖ్యాంశాలని ప్రస్తావించారు. కేజ్రీవాల్ పిటీషన్ లో మేము బెయిల్ గురించి పరిశీలించలేదు.. కానీ మనిలాండరింగ్ చట్టం.. సెక్షన్ 19 ని, అలాగే రాజ్యాంగం లోని సెక్షన్ 45 మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకున్నాం. సెక్షన్ 45ని అమలు పరిచే హక్కు కోర్టుకు ఉంది. సెక్షన్ 19పై పరిశీలన కోసం మరింత నైపుణ్యం కలిగిన అధికారులు, విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామి చెప్పారు.

Also Read: ‘ముస్లిం మహిళలకు విడాకుల భరణం’.. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేస్తూ పిటీషన్!


ఇప్పుడు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చినా.. కేజ్రీవాల్ కు జైలు నుంచి అప్పుడే విడుదల్లే అవకాశాలు లేవు ఎందుకంటే.. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ‌ను అవనీతి ఆరోపణలపై విచారణ కోసం జూన్ 26న సిబిఐ అరెస్టు చేసింది. అంటే కేజ్రీవాల్.. సిబిఐ కస్టడీ నుంచి బయటికి వచ్చేందుకు ప్రత్యేకంగా పిటీషన్ వేసుకోవాలి.

కేసు వివరాలు:

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ , ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2021-22లో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. కానీ ఈ పాలసీ ద్వారా కేజ్రీవాల్, ఇతర మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఢిల్లీ గవర్నర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: SpiceJet staffer arrested: జైపూర్ ఎయిర్‌పోర్టు.. సీఐఎస్ఎఫ్ జవాన్ చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్ జెట్ ఉద్యోగి..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21, 2024న అరెస్టు చేసింది. అయితే తనను ఈడీ అరెస్టు చేయడం.. చట్ట వ్యతిరేకమని చెబుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. కానీ హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించడంతో.. కేజ్రీవాల్.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఏప్రిల్ 9, 2024న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

Arvind Kejriwal May Not Walk Out Of Jail Despite Supreme Court Bail Verdict

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×