EPAPER

Independence Day: అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించేది సీఎం కాదు.. మంత్రే!

Independence Day: అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించేది సీఎం కాదు.. మంత్రే!

Arvind Kejriwa: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పంద్రాగస్టు ఉదయమే ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జెండాను ఆవిష్కరిస్తారు. అసెంబ్లీ ఉన్న ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో జాతీయ జెండాను సాధారణంగా ముఖ్యమంత్రే ఎగరేస్తారు. కానీ, ఈ సారి సీఎం కాకుండా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.


ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. దీంతో ఈ సారి పంద్రాగస్టున జాతీయ పతాకాన్ని ఎవరు ఎగరేస్తారు? అనే ఉత్కంఠ నెలకొంది. సీఎం సహా పలువురు ఆప్ ముఖ్య నేతలు కూడా జైలులో ఉన్నారు. కేజ్రీవాల్‌కు విశ్వాసపాత్రులైన నాయకురాలిగా మంత్రి అతిషీకి పేరున్నది. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండి జెండా ఎగరేసే పరిస్థితులు లేని పక్షంలో మంత్రి అతిషీకి ఆ అవకాశం దక్కాలని కేజ్రీవాల్ కాంక్షించినట్టు ఆప్ నాయకులు చెబుతున్నారు. కానీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ డిఫరెంట్‌గా డిసైడ్ చేశారు. అతీషిని కాకుండా హోం మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు ఆ అవకాశం కల్పించారు.

Also Read: Venu Swamy: బ్రేకింగ్.. వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు..


రాష్ట్రస్థాయి వేడుకల్లో ఛత్రసాల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి హోం మంత్రి కైలాష్ గెహ్లాట్‌ను నామినేట్ చేయడానికి సంతోషిస్తున్నామని లెఫ్టినెంట్ గవర్నర్ ఆశిశ్ కుంద్రా.. చీఫ్ సెక్రెటరీ నరేశ్ కుమార్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయంతో అతిషీ సహా పలువురు కీలక ఆప్ నాయకులను పక్కనపెట్టినట్టయింది. ఇది మరో రాజకీయ దుమారానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే విద్యా శాఖ మంత్రి అతిషీకి జాతీయ జెండా ఎగరేసే అవకాశం కల్పించాలని మంత్రి గోపాల్ రాయ్ సూచనలు చేశారు. ఈ డైరెక్షన్స్‌ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నిరాకరించింది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×