BigTV English

Arvind Kejriwal : గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం .. మోదీ డిగ్రీ వివాదంపై రివ్యూ పిటిషన్..

Arvind Kejriwal : గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం .. మోదీ డిగ్రీ వివాదంపై రివ్యూ పిటిషన్..

Arvind Kejriwal on Modi(Latest political news in India) : ప్రధాని మోదీ విద్యార్హత అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిల్ ను విచారణకు అంగీకరించిన న్యాయస్థానం వాదనలను జూన్ 30కి వాయిదా వేసింది. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదంపై మార్చి 31న వెలువరించిన ఉత్తర్వులపై కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ వేశారు. మోదీ డిగ్రీ అందుబాటులో ఉందన్న గుజరాత్ వర్సిటీ వాదనలు అవాస్తమని కేజ్రీవాల్ లేవనెత్తారు.


మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ కోసం ఢిల్లీ సీఎం మొదటి సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టు దీన్ని తప్పుపట్టి ఆయనకు ఫైన్‌ వేసింది. గుజరాత్‌ వర్సిటీ.. మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో ఉందని వెల్లడించింది. అయితే సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో లేదని పేర్కొంటూ కేజ్రీవాల్‌ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.

2016 ఏప్రిల్‌లో అప్పటి మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీధర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మోదీ డిగ్రీలకు సంబంధించిన సమాచారం అందించాలని ఆదేశించింది. అయితే సీఐసీ ఇచ్చిన ఆదేశాలను కోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.


శుక్రవారం గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరెన్ వైష్ణవ్ విచారణకు స్వీకరించి.. ఈ నెల 30కి వాయిదా వేశారు. అనంతరం గుజరాత్ వర్సిటీ, కేంద్ర ప్రభుత్వం, మాజీ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ శ్రీధర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రధాని మోదీ డిగ్రీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని వర్సిటీ చెప్పిందని, అయితే వర్సిటీ వెబ్‌సైట్‌లో అలాంటి డిగ్రీ అందుబాటులోనే లేదని కేజ్రీవాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×