EPAPER

Arun Yogiraj Ayodhya: అయోధ్య రాముడి విగ్రహం తయారు చేసిన శిల్పికి అమెరికా వీసా నిరాకరణ!

Arun Yogiraj Ayodhya: అయోధ్య రాముడి విగ్రహం తయారు చేసిన శిల్పికి అమెరికా వీసా నిరాకరణ!

Arun Yogiraj Ayodhya| అయోధ్య రామాలయంలో రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహం తయారు చేసిన ప్రముఖ శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ కు అమెరికా వెళ్లేందుకు అధికారులు వీసా నిరాకరించారని అతని కుటుంబసభ్యులు బుధవారం తెలిపారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ అమెరికాలో జరిగే కన్నడిగ సంఘాల సమావేశాల కోసం 20 రోజుల యాత్రకు వెళ్లాల్సి ఉండగా.. ఆయనకు వీసా లభించలేదు.


41 ఏళ్ల యోగిరాజ్ అమెరికాలోని రిచ్ మండ్, వర్జీనియాలో జరిగే 12వ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా సంఘం అంతర్జాతీయ సమావేశాలకు వెళ్లాల్సి ఉంది. దాంతో పాటు అమెరికాలో మరి కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయనకు కారణాలు తెలపకుండా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా నిరాకరించారు.

Also Read: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేసిన ప్రధాని మోదీ..


“ఆయన వీసాకు అప్లై చేశారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సమర్పించారు. అయినా ఆయన వీసా అప్లికేషన్ ని రిజెక్ట్ చేశారు. కారణాలేమిటో చెప్పలేదు, ” అని యోగిరాజ్ సోదరుడు మీడియాకు తెలిపాడు. ఎంబిఏ విద్యార్హత కలిగిన మైసూరు ప్రముఖ శిల్పి యోగిరాజ్ ఎన్నో కళా ఖండాలను తయారుచేశారు. అయోధ్యలోని 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహం, ఇండియా గేట్ వద్ద ఉన్న 28 అంగుళాల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కేదార్ నాథ్ లోని 12 అంగుళాల ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని ఆయనే తయారు చేశారు. ఈ మూడు విగ్రహాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించడం విశేషం.

Also Read: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ సందేశాలు పంపండి

అయోధ్య రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంలో యోగిరాజ్ మీడియాతో మాట్లాడుతూ..”ఈ రోజు నేను ఈ భూమిపై ఉన్న అత్యంత అదృష్టవంతుడిని. నాకు నా పూర్వీకుల ఆశీసులు, నా కులదైవ అనుగ్రహం ఉండడంతోనే ఆ బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసే సౌభాగ్యం నన్ను వరించింది. దాన్ని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను”, అని అన్నారు.

Also Read: శామ్ సంగ్ బాహుబలి బ్యాటరీ.. నిమిషాల్లో చార్జింగ్.. వేయికిలోమీటర్ల మైలేజ్!

అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం 8000 మంది హాజరయ్యారు. ఆ సమయంలో దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. దేశంలోని వేలాది దేవాలయాలు, ప్రభుత్వ భవనాలు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు దీపాలతో అలంకరించబడ్డాయి. అయోధ్యలో సాయంత్రం తారాజువ్వలతో ఆకాశం ప్రకాశవంతమైంది. సాయంత్రం ఆధ్యాత్మిక సంగీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ భగవాన్ శ్రీ రాముడిని స్వాగతించేందుకు అయోధ్య నగరమంతా సుందరంగా అలంకరించబడింది. చాలా చోట్లు అన్నదానం కార్యక్రమాలు జరిగాయి.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Also Read Ticket Deposit Receipt: ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి! 

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×