EPAPER

Farmers Delhi Chalo Protest: 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 14000 మంది రైతులు.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Farmers Delhi Chalo Protest: 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 14000 మంది రైతులు.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
today's breaking news in India

Farmers Delhi Chalo Protest: కనీస మద్దతు ధర (MSP) హామీలపై కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద భద్రతా బలగాలు బుధవారం ఉదయం టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి.


పోలీసు బారికేడ్లను కూల్చివేయడానికి నిరసనకారులు తీసుకువచ్చిన పరికరాలను స్వాధీనం చేసుకోవాలని హర్యానా పోలీసులు పంజాబ్ పోలీసులను కోరారు. 1,200 ట్రాక్టర్ ట్రాలీలు, 300 కార్లు, 10 మినీ బస్సులతో సుమారు 14,000 మంది రైతులు సరిహద్దులో గుమిగూడారు.

రైతులు ఫిబ్రవరి 13 నుంచి అంతర్రాష్ట్ర సరిహద్దులో ఆగి, దేశ రాజధాని వైపు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నందున.. ఎంట్రీ పాయింట్లను భద్రపరచడానికి ఢిల్లీ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు.


Read More: నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం.. ఇనుప కంచెల నడుమ రాజధాని..

తమ నిరసన పునఃప్రారంభానికి ముందు, కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్, రైతులు శాంతియుతంగా ప్రదర్శన చేస్తారని పునరుద్ఘాటించారు. బారికేడ్లను తొలగించి వారికి ఎటువంటి ఆటంకం లేకుండా ఢిల్లీకి వెళ్లడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

“మేము మా వైపు నుంచి మా వంతు ప్రయత్నం చేసాము, మేము సమావేశాలకు హాజరయ్యాము, ప్రతి అంశం చర్చించాము. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, మేము శాంతియుతంగా ఉంటాము. మేము ఈ అడ్డంకులను తొలగించి, ఢిల్లీ వైపు నడిచేందుకు అనుమతించాలి ” అని పంధేర్ చెప్పారు.

కాగా మంగళవారం, పంజాబ్- హర్యానా హైకోర్టు రైతులను పెద్ద సంఖ్యలో గుమికూడేందుకు అనుమతించవద్దని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం రహదారులపై ట్రాక్టర్-ట్రాలీలను నడపరాదని కోర్టు హెచ్చరించింది. రైతులు బస్సులో లేదా ప్రజా రవాణాలో ఢిల్లీకి వెళ్లవచ్చని పేర్కొంది.

Related News

Bihar Hooch : కల్తీ మద్యం తాగి 43 మంది మృతి.. విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

Salman Khan Death Threat: ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

Train Accident: ప్రమాదానికి గురైన మరో రైలు.. ఎనిమిది కోచ్‌లు బోల్తా.. పలు రైళ్లకు అంతరాయం!

Big Stories

×