EPAPER

Anmol Bishnoi Most Wanted: అన్మోల్ బిష్ణోయి తలపై రూ.10 లక్షల బహుమానం.. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో పేరు

Anmol Bishnoi Most Wanted: అన్మోల్ బిష్ణోయి తలపై రూ.10 లక్షల బహుమానం.. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో పేరు

Anmol Bishnoi Most Wanted| ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి సోదరుడు అన్మోల్ బిష్ణోయి పేరుని జాతీయ విచారణ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఇండియా మోస్ట వాంటెడ్ క్రిమినలస్ లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులు, కరుడుగట్టిన క్రిమినల్స్ ను టార్గెట్ చేసే ఎన్ఐఏ తాజాగా గ్యాంగ్ స్టర్ అన్మోల్ బిష్ణోయి తలపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అతడిని పట్టించివారికి ఈ రూ.10 లక్షల రివార్డు లభిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కొన్ని నెలల క్రితం జరిగిన కాల్పుల కేసులో అన్మోల్ బిష్ణోయి మాస్టర్ మైండ్ అని విచారణ ఏజెన్సీ తెలిపింది.


బిష్ణోయి క్రిమినల్ గ్యాంగ్ కు నాయకుడు అయిన లారెన్స్ బిష్ణోయి ప్రస్తుతం గుజరాత్ లోని సాబర్మతి జైల్లో ఖైదీగా ఉన్నాడు. లారెన్స్ బిష్ణోయితోపాటు, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయి, కెనెడాలో ఉన్న అతని స్నేహితుడు గోల్డీ బ్రార్‌ని.. ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై ఏప్రిల్ నెలలో జరిగిన కాల్పుల కేసులో ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది.

Also Read: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి


ఇప్పటివరకు ఈ కేసులో నవిముంబై పోలీసులు అయిదుగురు బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు.. ధనంజయ్, గౌరవ్ భాటియా, వాస్పి ఖాన్, రిజ్వాన్ ఖాన్, దీపర్ సింగ్ లను అరెస్టు చేశారు. వీరంతా కలిసి నవి ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ పై దాడి చేసేందుకు కుట్ర పన్నారని.. కానీ అంతలోపే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడైన ముంబై రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖ్ ని హత్య కేసులో కూడా అన్మోల్ బిష్ణోయి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 12, 2024న ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దిఖ్(66), తన కుమారుడు జీషాన్ ఆఫీసు నుంచి బయటికి వస్తుండగా.. బహిరంగంగా ఆయనపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల సమయంలో ఆయన పక్కనే పోలీసులు నిలబడి ఉండడం గమనార్హం. కాల్పుల తరువాత ఆయన కొన్ని గంటల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడికి ముందు ఫోన్ ద్వారా అన్మోల్ బిష్ణోయి ఆదేశాలు
ఏప్రిల్ 14, 2024 రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్లపై వచ్చి సల్మాన్ ఖాన్ ఇంటిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడుల కేసులో పోలీసులు వివరంగా చార్జ్ షీటు తయారు చేశారు. ఈ చార్జ్ షీట్ ప్రకారం.. విదేశాల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ అన్మోల్ బిష్ణోయి ఫోన్ ద్వారా కొందరు షూటర్లకు సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి చేయమని ఆదేశించాడు. అన్మోల్ బిష్ణోయి ఫోన్ లో అదేశాలు ఇస్తున్న 9 నిమిషా రికార్డింగ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లు వికీ గుప్తా, సాగర్ పటేల్.. ఇద్దరితో దాడికి ముందు అన్మోల్ బిష్ణోయి మాట్లాడి వారికి దాడి చేసేందుకు ప్రేరేంపించాడు. ఈ దాడి చేయడానికి ఆగస్టు 2023 నుంచి నెలలపాటు ప్లానింగ్ కూడా జరిగింది.

చార్జి షీట్ లో తెలిపిన వివరాల ప్రకారం.. బిష్ణోయి గ్యాంగ్ ఈ దాడి చేయడానికి పాకిస్తాన్ నుంచి ఏకె-47, ఏకె-92, M16-రైఫిళ్లు, టర్కీలో తయారైన జిగనా పిస్టోల్ లాంటి ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఇలాంటి ఆయుధాలతోనే పంజాబీ సింగర్ సిద్దు మూసేవాలాను హత్య చేయడానికి ఉపయోగించారు. సల్మాన్ ఖాన్ పై దాడి చేయడానికి బిష్ణోయి గ్యాంగ్ 60 నుంచి 70 మంది చేత కేవలం రెక్కీ చేయించిందని సమాచారం. సల్మాన్ ఖాన్ ఇల్లు, అతను తరుచూ వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీ, పన్వేల్ లోని అతని ఫామ్ హౌస్ వద్ద వీరంతా ప్రతి క్షణం నిఘా ఉంచారు.

Related News

Teachers In Obscene Act: క్లాస్‌రూమ్‌లో టీచర్లు అలాంటి పాడుపని.. విద్యార్థులు రావడంతో..

Baba Siddique Son: అజిత్ పవార్ పార్టీలో చేరిన బాబా సిద్దిఖ్ కుమారుడు.. ‘మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి రెడీ’

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Big Stories

×