EPAPER

Anand Mahindra: చిన్నారిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ఎందుకంటే ?

Anand Mahindra: చిన్నారిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ఎందుకంటే ?

Anand Mahindra: స్పూర్తివంతమైన కథనాలను నిత్యం పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. అమెరికాలో జరిగిన ఓ టాలెంట్ షోలో భారత సంతతికి చెందిన చిన్నారి తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకోవడంపై ఆయన ప్రశంసలు కురిపించారు.


ఆమె తన గానంతో న్యాయనిర్ణేతలను సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. భారత సంతతికి చెందిన ప్రణిస్కా మిత్రా తొమ్మిదేళ్ల వయస్సు ఉంది. తల్లిదండ్రులతో పాటు ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. ఇటీవల అమెరికాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో చిన్నారి పాల్లొంది. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చురుగ్గా సమాధానం చెప్పింది. తాను ఇక్కడి వరకు వచ్చేందుకు తన అమ్మమ్మ ఎంతో ప్రోత్సాహం అందించినట్లు తెలిపింది. అనంతరం తన పాటతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. గోల్డెన్ బజర్‌ను సొంతం చేసుకుని ఔరా అనిపించింది. దీంతో ఈ చిన్నారిపై ఆనంద్ ప్రశంసలు కురిపించారు.

అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో భారతీయ సంతతి అమ్మాయిని ప్రశంసిస్తూ ఆనంద్ మహేంద్రా ట్వీట్ చేశారు. రియాలిటీ షోలో ఫ్లోరిడాకు చెందిన చిన్నారి తన ప్రతిభతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. దీంతో అమెరికాకు నిజంగానే టాలెంట్ ఉంది.. కానీ అది చాలా వరకు భారతదేశం నుండే వస్తుంది అంటూ ఆనంద్ మహీంద్ర అమెరికాస్ గాట్ టాలెంట్ లో చిన్నారిని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఇది వైరల్ గా మారింది. పాటతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది చిన్నారి. దీంతో సూపర్ మోడల్ హెడీ క్లమ్ నుంచి గోల్డెన్ బజర్ అందుకుంది


Also Read: స్విమ్మింగ్ వీడియోపై బీజేపీ విమర్శలు.. తిప్పికొట్టిన మంత్రి

అంతే కాదు.. ఆమె స్టేజ్ మీదకు వచ్చి ఆత్మీయంగా చిన్నారిని హగ్ చేసుకుంది. ఆ తర్వాత ఆమె తండ్రి కూడా కూతురు గెలిచిన ఆనందంతో మురిసిపోయారు. ఇంతలో వీడియో కాల్ ద్వారా ఆమె అమ్మమ్మ లైన్ లోకి రావడంతో అక్కడ వాతావరణం ఎంతో ఆనందము, భావోద్వేగంతో నిండిపోయింది. ప్రోగ్రామ్ తర్వాత ఆ చిన్నారి తన అమ్మమ్మతో మాట్లాడడం జరిగింది. మనవరాలు సాధించిన విజయంపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికాస్ గాట్ టాలెంట్ వేదికపై భారత సంతతికి చెందిన చిన్నారి అద్భుతం చేసింది. అక్కడ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె తన అమ్మమ్మతో మాట్లాడే సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయని మహేంద్ర ఎక్స్ లో పేర్కొన్నారు.

 

 

Related News

6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

×