EPAPER

Akhilesh Yadav: బంగ్లాదేశ్ అల్లర్లు.. అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav: బంగ్లాదేశ్ అల్లర్లు.. అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav latest news(Telugu breaking news today): బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పరోక్షంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు పొరుగు దేశంలోని పరిస్థితులను ఉపయోగించుకుంటే చివరికి ఆ దేశమే బలహీనపడుతుందని అన్నారు. ఆయన ఏ దేశం పేరునూ ప్రస్తావించలేదు. అయితే బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


ఒక దేశంలోని పరిస్థితులను మరో దేశం ఆసరాగా చేసుకుని తమకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని అనుకుంటే అది వారిని అంతర్గతంగా, బాహ్యంగా బలహీనపరుస్తుంది. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడం సరైన చర్య కాదు. అక్కడ ప్రదర్శలు హింసాత్మకంగా మారితే.. మౌనంగా ఉండటం సరికాదు. అది విదేశాంగ విధాన వైఫల్యమే అవుతుందని ఎక్స్ వేదికగా అఖిలేశ్ పేర్కొన్నారు.

Also Read: కలకత్తా ట్రైనీ వైద్యురాలి ఘటనపై దర్యాప్తునకు దీదీ డెడ్‌లైన్


అంతకు ముందు చేసిన మరో పోస్టులో కూడా ఆయన బంగ్లాదేశ్ పేరును ప్రస్తావించారు. సరైందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే పలు సందర్భంల్లో వివిధ కారణాలతో అనేక దేశాల్లో హింసాత్మక విప్లవాలు, తిరుగుబాట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో ఆ దేశం మాత్రమే తిరిగి పుంజుకుంది. బంగ్లాదేశ్‌లో శాంతి స్ధాపనకు కేంద్రం కృషి చేయాలి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఈ అంశాన్ని భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తాలని అన్నారు. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×