EPAPER

Air India Flight : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

Air India Flight : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

Air India Flight : భారత రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని చికాగో పయనిస్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. ఫలితంగా విమానాన్ని కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు.


దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటన సైతం జారీ చేసింది. మంగళవారం దిల్లీలోని ఇందిర గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చికాగో వెళ్తున్న ఆల్ 127 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యగా, సదరు విమానాన్ని కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయంలో ఆకస్మికంగా ల్యాండింగ్ చేశారు.

అనంతరం భద్రతా ప్రోటోకాల్ ప్రకారం విమానంతో పాటు ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేశామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. విమానాశ్రయంలో ఏజెన్సీలను సైతం ఏర్పాటు చేశామని, తద్వారా ప్రయాణికులకు సహాయం చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు.  గత కొద్దిరోజులుగా ఎయిర్ ఇండియా సహా ఇతర విమానయాన సంస్థలకు అనేక బాంబ్ బెదిరింపు హెచ్చరికలు రాగా వాటిపై విచారణ చేపట్టిన అధికారులు ఇవన్నీ ఫేక్ గా తెల్చారు.


ఎయిర్‌లైన్ ఆపరేటర్‌గా తమకు బాధ్యతలున్నాయమన్న ఏయిర్ ఇండియా, ఆయా బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి క్షమాపణలు కోరింది.

ఇక బెదిరింపులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించేందుకు ఎయిర్ ఇండియా సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ఫలితంగా ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందులను, అసౌకర్యానికి నిందితులే బాధ్యత వహించేలా చూస్తామని చెప్పింది. ఇదే సమయంలో విమానయాన సంస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చట్టపరమైన చర్యలు సైతం తీసుకుంటామని హెచ్చరించింది.

మరో ఘటనలో మంగళవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. బోయింగ్ 737-మాక్స్ 8 విమానంలో దాదాపుగా 132 మంది ప్రయాణికులు ఉన్నారు. జైపూర్ నుంచి బయలుదేరిన ఈ విమానం అత్యవసరంగా అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అనంతరం అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం సేఫ్ అనుకున్న అధికారులు, విమానం వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

also read : పోలింగ్‌కు 5 రోజుల ముందే అలా చేస్తాం, ఆ ఛాన్సే లేదు.. ఎగ్జిట్‌పోల్స్‌తో గందరగోళం: చీఫ్ ఎలక్షన్ కమిషనర్

Related News

India-Canada diplomatic row: భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం, వీసాల జారీ, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా?

Lawrence Bishnoi: ఆ గ్యాంగ్ స్టర్ తో ఇండియన్ ఏజెంట్లకు సంబంధాలు, భారత్ పై కెనడా చిల్లర ఆరోపణలు!

India canada diplomatic row: నిజ్జర్ హత్య కేసు చిచ్చు.. ఆరుగురు కెనడా దౌత్య వేత్తలను బహిష్కరించిన భారత్

UN Peacekeepers Netanyahu: ‘అడ్డుతొలగండి.. లేకపోతే మీకే నష్టం’.. లెబనాన్‌ ఐరాస కార్యకర్తలను హెచ్చరించిన నెతన్యాహు

China military Drill Taiwan| తైవాన్ చుట్టూ చైనా మిలటరీ డ్రిల్.. ‘యుద్దం రెచ్చగొట్టేందుకే’

Israeli bombardment In Gaza: గాజా బాంబుదాడుల్లో 29 మంది మృతి.. లెబనాన్ లో మరో ఐరాస కార్యకర్తకు తీవ్ర గాయాలు

Big Stories

×