EPAPER

Air hostess arrested in Kerala: గోల్డ్ స్మగ్లర్లు కొత్త ఎత్తులు, బుక్కైన ఎయిర్‌హోస్టెస్, బంగారాన్ని…

Air hostess arrested in Kerala: గోల్డ్ స్మగ్లర్లు కొత్త ఎత్తులు, బుక్కైన ఎయిర్‌హోస్టెస్, బంగారాన్ని…

Air hostess arrested in Kerala: గోల్డ్ స్మగ్లర్ల ఆగడాలు అన్నీఇన్నీ కావు. బంగారాన్ని అక్రమంలో తరలించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తారు. ఈ క్రమంలో అందర్నీ పావుగా వినియోగించు కుంటారు. ఈ క్రమంలో ఓ ఎయిర్ హోస్టెస్ అడ్డంగా బుక్కయ్యింది. చివరకు కస్టమ్స్ అధికారలకు చిక్కి అరెస్ట్ అయ్యింది. కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఒకప్పుడు ట్రావెలర్స్‌ని మాత్రమే వినియోగించుకునే స్మగ్లర్లు, ఈసారి ఎయిర్ హోస్టెస్‌లను టార్గెట్ చేశారు.


ఏం జరిగింది? ఎలా జరిగింది? ఈనెల 28న గల్ఫ్‌లోని మస్కట్ కేరళలోని కన్నూరు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం వచ్చింది. అక్కడి నుంచి వచ్చినవారిలో ఎయిర్ హోస్టెస్ కూడా ఉన్నారు. ఆమె తన రహస్య అవయవాల్లో బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చింది. దాదాపు 960 గ్రాములు బంగారం పట్టుబడింది.

బంగారం స్మగ్లింగ్‌పై అధికారులకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ రోజు విమానం నుంచి దిగిన ప్రయాణికులతోపాటు సిబ్బందిని తనిఖీలు చేశారు. చివరకు ఎయిర్ హోస్టెస్ అడ్డంగా దొరికిపోయింది. నిందితురాలిని సురభి ఖతూన్‌గా గుర్తించారు. కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కాసేపు విచారించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆమెకి 14 రోజులు కస్టడీ విధించారు.


ALSO READ: సాఫ్టుగా ఉంటే అంతే! ఐటీ ఉద్యోగ కష్టాలు

ఈమె బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదేకాదని, గతంలో పలుమార్లు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. దేశంలో  బంగారం స్మగ్లింగ్‌లో కేరళ తొలి ప్లేస్‌లో నిలిచినట్టు గతంలో నివేదికలు వచ్చాయి. దీని తర్వాత కేరళలోని అన్ని విమానాశ్రయాల్లో సెక్యూరిటీగా మొహరించారు. అయినా బంగారం పట్టుబడుతూనే ఉంది.

 

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×