EPAPER
Kirrak Couples Episode 1

Chandrayaan-3 Complete Details : చంద్రయాన్-3తో లాభాలేంటి? చంద్రుడిపై ఏం చేస్తుంది?

Chandrayaan-3 Complete Details : చంద్రయాన్-3తో లాభాలేంటి? చంద్రుడిపై ఏం చేస్తుంది?
Chandrayaan 3 full details in telugu

Chandrayaan 3 full details in telugu(ISRO latest news) :

చంద్రయాన్‌ ప్రాజెక్టు సక్సెస్‌తో భారత వైజ్ఞానిక రంగంలో ఘననీయ మార్పులు రానున్నాయి. అంతరిక్ష రంగంలో దేశం దూసుకుపోవడం ఖాయం.


చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు సుమారు రూ. 600 కోట్ల వ్యయం చేశారు. చంద్రయాన్-3లోని ల్యాండర్ విక్రమ్.. జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. రెండు గంటల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చింది. ప్రజ్ఞాన్ చంద్రుడిపై తిరుగుతూ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. ఈ 14 రోజులు చంద్రడుపై సూర్యకాంతి ప్రసరిస్తూ ఉంటుంది. అందువల్లే పరిశోధన సులభమవుతుంది. విక్రమ్‌ నుంచి విడిపోయిన చంద్రయాన్‌-3 నౌక ఇతర గ్రహాలపై ఫోకస్ చేస్తుంది. ఇందులో ఉన్న సాంకేతిక ఉపకరణాలు పరిశోధనలు చేస్తాయి.

ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలం, చంద్రగర్భంలోని ఖనిజ వనరులను శోధిస్తుంది. అక్కడి వాతావరణంపైనా పరిశోధనలు చేస్తుంది. చంద్రుడిలో ఉన్న హీలియం, ఇతర ఖనిజ నిక్షేపాలు భవిష్యత్తులో గొప్ప ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునేలా చేస్తాయి. ఆ ఖనిజాల వినియోగంలో కీలక పాత్ర పోషించాలని భారత్‌ సంకల్పిస్తోంది.


చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీరు మంచురూపంలో ఉంటుంది. అక్కడ సూర్యకాంతి ప్రసరించని నీడలో ఉండే ప్రాంతాలు మంచుకు నిలయాలుగా ఉన్నాయి. ఈ అంశంపై చంద్రయాన్‌-3 పరిశోధన చేపడుతుంది. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసానికి ఈ నీరే జీవనాధారంగా నిలుస్తుందని భావిస్తున్నారు. చంద్ర జలాన్ని ఉదజని, ఆమ్లజనిగా విడగొడితే కుజుడితోపాటు ఇతర గ్రహాలకు పంపే అంతరిక్ష నౌకలకు ఇంధనంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ప్రయోగించిన చంద్రయాన్‌-2 నౌక చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న సమయంలో రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలతో జాబిల్లిపై క్రోమియం, సోడియం, మాంగనీస్‌ నిక్షేపాలను గుర్తించింది.

చంద్రయాన్-3 సక్సెస్ అయితే భారత్ ఎన్నో అవకాశాలను అందుకుంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్‌లో ప్రస్తుతం భారత్ వాటా 2 శాతం మాత్రమే. ఈ దశాబ్దం చివరినాటికి ఈ వాటాను 9 శాతానికి తీసుకెళ్లాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత జీడీపీకి అంతరిక్ష రంగం ద్వారా 0.25 శాతం వాటా సమకూరుతోంది. 2040నాటికి రెట్టింపు చేయాలన్న పట్టుదలతో ఉంది. 30 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే సత్తా భారత అంతరిక్ష పరిశ్రమకు ఉందని అంచనా వస్తున్నారు. 34 దేశాల కోసం 381 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ఆదాయాన్ని ఆర్జించింది. ప్రపంచంలో ఆరో పెద్ద అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. రెండు దశాబ్దాలుగా చాలా దేశాల ఉపగ్రహాలనూ ప్రయోగిస్తోంది. చంద్రయాన్-3 విజయవంతమైతే ప్రపంచ దేశాలు భారత్ వైపు పరుగులు పెట్టడం ఖాయం.

Related News

Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Big Stories

×